రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌

అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 18 నుంచి జూన్ 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు, గృహప్రవేశాలు సహా శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి.

పెళ్లిళ్లు..ఇతర శుభా కార్యాలకు గురువారం నుంచి బ్రేక్ పడనుంది. తెలుగు రాష్ట్రాలలో 36రోజుల పాటు శుభ కార్యాలకు అనుకూల మూహుర్తాలు లేవు. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్‌ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్‌ పడనుంది.

ఈ నేపథ్యంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13 వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వివాహాది శుభాకార్యాల సందడి నెలకొంది. మే 18 నుంచి జూన్‌ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు కూడా పెళ్లీ వేడుకకు 36 రోజులు ఆగాల్సిందే. ఈ విరామం వల్ల పౌరోహిత్యం, కల్యాణ మండపాలు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ వంటి రంగాలపై ఆధారపడిన వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడనుంది.ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి శుభాకార్యాలు షురూ అయ్యాయి. వచ్చే నెల రోజులకు పైగా పెళ్లి సందడి లేకపోయినా,మళ్లీ జూన్‌ 19 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది శుభా ముహూర్తాలు

వివాహాలకు ఈ ఏడాది జూన్‌ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలు అనువైనవిగా పండితులు తెలిపారు. సెప్టెంబర్ 1, 3, 4, 5, అక్టోబర్‌ 11, 14, 29, 30, నవంబర్‌ నెలలో 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్‌ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి.

ఇవి కూడా చదవండి :

Venus Enters Gemini | మే 14న మిథునంలోకి శుక్రుడు..! ఈ ఐదు రాశుల వారి వైవాహిక జీవితం ఆనంద‌మ‌య‌మే..!!
Lizard | మ‌హిళ‌ల‌కు బ‌ల్లి అక్క‌డ ప‌డితే.. మ‌గ శిశువు జ‌న్మిస్తాడ‌ట‌..!

Latest News