Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కలహాలు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి దశ కొనసాగుతోంది కాబట్టి ఈ వారం వీరికి ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. పిత్రార్జితం ద్వారా కానీ, పూర్వీకుల ఆస్తుల ద్వారా కానీ విశేషమైన ధనలాభాలు ఉంటాయి. ఆస్తులు వృద్ధి చేస్తారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పదోన్నతి సూచన ఉంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి సారిస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ఈ వారం శుభవార్తలు వింటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభయోగం, విజయం సిద్ధిస్తాయి. ఆర్థికంగా విశేష లాభాలు అందుకుంటారు. విద్యార్థులు విజయం కోసం కఠిన శ్రమ చేయాల్సి ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యలు తొలగుతాయి. కీలకమైన వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారంతో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వృత్తిలో పట్టుదల వదలకుండా పనిచేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. విద్యార్థులు సమయపాలనతో చదివితే విజయాన్ని పొందవచ్చు. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్, వ్యాపార పరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులు కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించగలరు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. పని పట్ల నిబద్ధత అవసరం. నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. పొదుపు చేయడం తప్పనిసరి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనుల్లో విజయాలను సాధిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరి. పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి నడుచుకోవాలి. వృత్తి పరమైన ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. పని పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు. పనికట్టుకుని ఆటంకాలు సృష్టించే వారుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. వ్యాపారంలో రుణాలు, ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగతంగా చూస్తే ఈ వారం అంత అనుకూలం కాదు. జీవిత భాగస్వామితో అనవసర కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొంత కాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు కృషితో విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే సవాళ్లు సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే విజయావకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారంతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు వారం ద్వితీయార్ధం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. లాభాల శాతం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.