Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీట‌లెక్కుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 21, 2025 7:46 AM IST
Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీట‌లెక్కుతారు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం అదృష్ట దాయకంగా ఉంటుంది. గ్రహ సంచారం అద్భుతంగా ఉన్నందున తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సొంతమవుతుంది. వ్యాపారులకు ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభాలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. విదేశీయానం కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మంచి లాభాలను ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి కోసం, ఆశించిన లాభాల కోసం తీవ్రంగా శ్రమించాలి. సమిష్ఠి కృషితో ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. ఉద్యోగులు పని ప్రదేశంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అహంకారంతో కాకుండా అవగాహనతో మెలగడం మంచిది. కుటుంబంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వృత్తి పరంగా ఎదగడానికి సన్నిహితుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. అనుకోని ఆపదలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆస్తి, గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతిని చూడవచ్చు. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. స్దాన చలనం సూచన ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విదేశాలలో కెరీర్ కొనసాగించడానికి, వ్యాపార విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రావలసిన బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి. వారం చివరలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం సవాలుగా ఉండవచ్చు. ఉన్నతాధికారులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ భద్రతపై దృష్టి సారించండి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఊహించని భారీ పెట్టుబడులకు ఈ వారం అవకాశం ఉంది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. గతంలోని నష్టాలు కూడా లాభాలుగా మారి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తాయి. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. ప్రేమ వ్యవహారాల్లో ఎదురయ్యే గందరగోళం అవగాహనతో సమసిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం నెలకొంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు ఈ వారం పనిపట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్సాహం, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవడం అవసరం. పని ప్రదేశంలో సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారంలో శుభ యోగాలున్నాయి. భారీ ప్రాజెక్టులపై సంతకాలు, కీలక ఒప్పందాలు చేసుకుంటారు. సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చులు అదుపు చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబం పట్ల బాధ్యతగా మెలగాలి. ఒత్తిడి, పనిభారం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. తీరికలేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ మార్పు ఆలోచన వాయిదా వేయడం మంచిది. అధికారులతో విభేదాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారంలో నిరంతర కృషి మాత్రమే విజయానికి చేరువ చేస్తుంది. స్థిరాస్తిలో పెట్టుబడులకు అనువైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ప్రతికూల ఆలోచనలు వీడి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. చట్టపరమైన సమస్యలో చిక్కుకునే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించండి. వారం చివరలో వృత్తి పరంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి తమ తమ రంగాల్లో వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ వృత్తి పట్ల చూపే అంకిత భావానికి ప్రశంసలు అందుకుంటారు. ఇన్ని రోజుల మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగ మార్పుకు ఇది అనుకూలమైన సమయం కాదు. వ్యాపారులు వ్యాపారాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవసరానికి రుణాలు లభిస్తాయి. ప్రియమైన వారి నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఇతరుల జోక్యం కూడదు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది వారం చివరలో జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం ఉద్యోగంలో జాగ్రత్తగా మెలగాలి. పనిపట్ల చిత్తశుద్ధి, శ్రద్ధ ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. స్థానచలనానికి అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు ఈ వారం అంత అనుకూలంగా కాదు. వ్యాపారంలో పోటీ సవాళ్లు ఎదురవుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం తెలివిగా పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో సహనం అవసరం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. అదృష్టం వరించి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగులు బుద్ధిబలంతో, సొంత నిర్ణయాలతో పనిచేస్తే శుభఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెంచుకుంటే మంచిది. జీతం పెరుగుదల ద్వారా అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచి రాబడిని ఇస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత రంగాల్లో పనిచేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యత నెలకొంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు, భూములు స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోళ్లు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. కీలక బాధ్యతలను చేపడతారు. ప్రారంభించిన పనుల్లో ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారంలో విజయం సాధించడానికి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.