Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో అపార్థాలు.. జర జాగ్రత్త..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి దశ కొనసాగుతోంది. షేర్ మార్కెట్లో ఆకస్మిక లాభాలు లేదా లాటరీలు ద్వారా ఊహించని ధన లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పదోన్నతి సూచన ఉంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. అనవసర చర్చలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించడం అవసరం. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. ఆశించిన లాభాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయంలో స్వల్ప తగ్గుదల కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు, ఇతర రంగాల వారికి ధనలాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. ప్రేమ సంబంధంలో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. . ఆర్థికంగా బలమైన దశ నడుస్తోంది. భూ గృహ వాహన యోగాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. నూతన పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. ముందు జాగ్రత్తతో అనారోగ్య సమస్యలు నివారించవచ్చు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం మంచి అదృష్టయోగం ఉంటుంది. వృత్తి పరంగా మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. సహచరుల సహాయంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. దీర్ఘకాలిక ఆస్తి ఒప్పందాలు మంచి రాబడిని తీసుకురావచ్చు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులు మిత్రుల సహాయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణకు అవసరమైన పెట్టుబడులు సమకూరుస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ప్రేమ వ్యవహారాల్లో, ఇతరుల జోక్యంతో సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మధ్య సమాచార లోపం లేకుండా చూసుకోండి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కొంత పనిఒత్తిడి, శ్రమ తప్పక పోవచ్చు. వ్యాపారంలో ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. ముందుచూపుతో, చక్కని ప్రణాళికతో వ్యాపారాన్ని లాభాలబాటలో నడిపిస్తారు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఏర్పడకుండా ఓర్పుతో వ్యవహరించాలి. ముఖ్యంగా కోపావేశాలు తగ్గించుకుని సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. బుద్ధిబలంతో ప్రయత్నిస్తే ఒత్తిడి తొలగిపోతుంది. అధికారులతో అప్రమత్తంగా నడుచుకోవాలి. ప్రేమ జీవితంలో మూడవ వ్యక్తి ప్రమేయంతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. జీవిత భాగస్వామితో అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అందరినీ సంప్రదించడం అవసరం. ఆర్థిక పరంగా, ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల కోసం ధనవ్యయం ఉండవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికినీ ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో పనిచేసి కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడితే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా పడాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఊహించని సంఘటనల కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. వ్యాపారులు వృధాప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంతకాలం వేచి చూస్తే మంచిది. ప్రేమ వ్యవహారాలు కలిసిరావు. కుటుంబ కలహాల కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుతాయి. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆత్మీయుల సహకారంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లు ఉన్నా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి బాట పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుది. వృధా ఖర్చులు నివారిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారులకు గతంలో రావలసిన బకాయిలు కూడా అందుతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయటా పెద్దల మాటలకు విలువ ఇవ్వడం మంచిది. ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.