Hair Cutting | గురువారం గోర్లు, జుట్టు క‌త్తిరించుకుంటే శుభ‌మా..? అశుభ‌మా..?

Hair Cutting | చాలా మంది ఆధ్మాత్మిక( Spiritual ) భావ‌న‌ను క‌లిగి ఉంటారు. అలాంటి వారు ఈ రోజుల్లో ప‌నులు చేయాలి.. ఈ ప‌నులు చేయ‌కూడ‌దు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. మ‌రి గురువారం( Thursday ) గోర్లు( Nails ), జుట్టు( Hair ) క‌త్తిరించుకోవ‌ద్దు అని కొంద‌రు అంటుంటారు. మ‌రి క‌త్తిరించుకుంటే శుభమా..? అశుభ‌మా..? అనే విష‌యాన్ని ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Oct 16, 2025 6:45 AM IST
Hair Cutting | గురువారం గోర్లు, జుట్టు క‌త్తిరించుకుంటే శుభ‌మా..? అశుభ‌మా..?

Hair Cutting | హిందూ మ‌తం( Hindu Religion )తో ప్ర‌తి రోజుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. అంతేకాదు.. ఈ రోజున ఈ ప‌ని చేయాలి.. ఈ రోజున ఈ దేవుడి( God )ని పూజించాలి అని న‌మ్ముతుంటారు. అయితే ఈ సంప్ర‌దాయం గ‌త కొన్ని శ‌తాబ్దాలుగా కొన‌సాగుతూనే ఉంది. మ‌రి గురువారం నాడు జుట్టు( Hair ) క‌త్తిరించుకోవ‌ద్దు.. గోర్లు(Nails ) తీసుకోవ‌ద్దు అని పెద్దలు చెబుతుంటారు. అస‌లు దీంట్లో ఎంత వాస్త‌వం ఉంది..? శుభ‌మా..? అశుభ‌మా..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

హిందూ గ్రంథాల‌యాల్లో గురువారం గోర్లు, జుట్టు క‌త్తిరించుకోవ‌డాన్ని అశుభంగా భావిస్తున్నారు. అందుకే నేటికీ ఇళ్లలో పెద్దలు గురువారం జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం లేదా గోర్లు కత్తిరించడం వంటి పనులు చేస్తుంటే వద్దని వారిస్తారు. ఇక ఆధ్యాత్మికంగా ప‌రిశీలిస్తే.. గురువారం విశ్వ రక్షకుడైన శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల గురువు అయిన బృహస్పతి రోజుగా కూడా పరిగణిస్తారు. నమ్మకాల ప్రకారం, గురువారం నాడు జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకుంటే విష్ణువు అనుగ్రహం దక్కదని నమ్మ‌కం. అంతేకాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లను కత్తిరించడం కూడా దేవ గురువు బృహస్పతికి అసంతృప్తికి గురి చేస్తుంది అని విశ్వ‌సిస్తుంటారు.

శాస్త్రీయ కారణం

గురువారం నాడు జుట్టు, గోళ్లను కత్తిరించుకోవద్దు అని చెప్పడం కేవలం మతపరమైన కారణం మాత్రమే కాదు.. శాస్త్రీయమైనది కూడా. చేతివేళ్లు చాలా సున్నితమైనవి. అవి గోళ్ల ద్వారా రక్షించబడతాయి. గురువారం నాడు విశ్వం నుంచి వెలువడే అనేక సూక్ష్మ కిరణాలు మానవ శరీరంలోని సున్నితమైన భాగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కట్టించుకోవడం వంటి పనులు నిషేధించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.