Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఇల్లు, భూమి కొనేందుకు అనుకూల సమయం..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టటానికి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి అనువైన సమయం. ఆస్తులను వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహచరులతో వృత్తి పరమైన విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రేమ జీవితంలో, కొన్ని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. రుణభారం తగ్గడం, ఆదాయం పెరగడం సంతృప్తిని ఇస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో గతంలో ఆగిపోయిన ఒప్పందాలు ఇప్పుడు ఖరారు కావచ్చు. ఇది మంచి లాభాలకు దారితీస్తుంది. ఉద్యోగులకు గొప్ప శుభ సమయం. మీ పనితీరుకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, ప్రశంసలు అందుకుంటారు. పెరుగుతున్న ఆదాయం సంతృప్తినిస్తుంది. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి సమయం కేటాయించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వ్యహారాలు అనుకూలంగా ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులకు రుణభారం తగ్గుతుంది. లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ప్రతిభతో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఇంకొంత కాలం వేచి చూస్తే మంచిది. ఆర్థికంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. వైవాహిక సంబంధాలలో నమ్మకంతో మెలగాలి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రుణసమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. వాదప్రతివాదనలకు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. పనిలో నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటే విజయం సిద్ధిస్తుంది. షేర్ మార్కెట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. రావలసిన బకాయిలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుతో ఉండాలి. పాత సమస్యలు మళ్ళీ ఏర్పడే అవకాశముంది కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో కెరీర్, వ్యాపార పరంగా కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. మంచి ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కెరీర్, వ్యాపార పరంగా ఆదాయాన్ని పెంచే ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందుకుంటారు. దీనితో ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగస్తులు విజయం సాధించాలంటే అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి అవగాహన, సహనంతో ముందుకు సాగాలి. ఆర్థిక పరంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
తుల (Libra)
తుల రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగులు మంచి అవకాశాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. వైవాహిక జీవితంలో ఏర్పడే అపార్థాలు అవగాహనతో తొలగిపోతాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. క్రమశిక్షణ, కృషితో విజయం సాధించవచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు, వ్యాపార అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో ఉత్సాహం కోల్పోకుండా జాగ్రత్త పడండి. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. బంధు వర్గం నుంచి, పితృ వర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలుంటాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇల్లు, భూమి కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. ఉద్యోగులు స్వయంకృషితో పదోన్నతులు అందుకుంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులు కొత్త ప్రాజెక్ట్‌లు అందుకుంటారు. ఉద్యోగులు తమ ప్రతిభతో కొత్త అవకాశాలు పొందుతారు. పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వ్యాపార వృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఒప్పందాలు మంచి లాభాలు అందిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడి చదివితేనే విజయం సాధించగలరు. వైవాహిక జీవితం ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో వృత్తిపరమైన ఆటంకాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో విజయం సాధిస్తారు. వ్యాపారులు చక్కని ప్రణాళికతో మంచి లాభాలను గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు.
మీనం (Pisces)
మీనం రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు పఠిష్టమైన ప్రణాళిక లేకపోతే ఆర్థికంగా నష్టపోవచ్చు. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెంచాలి. బాధ్యతాయుతంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రత్నించే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. రుణాలు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దు. ప్రేమ వ్యవహారాల్లో అహంకారంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉండండి.