Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీట‌లెక్కుతారు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ప్రేమికులు పెళ్లి పీట‌లెక్కుతారు..!

Weekly Horoscope | Weekly Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నమ్మకం ఉంది. లేచిన ద‌గ్గ‌రి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. రాశి ఫ‌లాల ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు ఆదివారం, మార్చి 2 న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం

మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే వృత్తి పట్ల అంకితభావం, చిత్తశుద్ధి అవసరం. వృత్తి పరంగా ఇంటా బయటా సవాళ్లు ఎదురైనా కుటుంబ సభ్యుల మద్దతుతో అధిగమిస్తారు. వ్యాపారంలో పోటీ, సవాళ్లు ఎదురవుతాయి. విదేశాలలో కెరీర్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొనాలంటే జీవిత భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నిరుద్యోగులు మెరుగైన ఉద్యోగం సాధించడానికి తీవ్రమైన కృషి అవసరం.

వృషభం

వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కొన్ని ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపార కార్యకలాపాలలో కూడా చేసే ప్రయత్నాలలో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ఊహించని ప్రయాణాలు ఉండే అవకాశముంది. నిదానంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు కెరీర్‌లో ముందుకు వెళ్ళడానికి అంకితభావం, అదనపు కృషి అవసరం. గ్రహసంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఆస్తుల భద్రతపై దృష్టి సారించండి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించడానికి గణనీయమైన కృషి చేయాలి. జీవితభాగస్వామితో విభేదాలు సమసిపోతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మిథునం

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వృత్తి పరంగా ఎదగడానికి సన్నిహితుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. అనుకోని ఆపదలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆస్తి, గృహ నిర్మాణాలకు సంబంధించిన వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో వారం ప్రారంభంలో గణనీయమైన పురోగతిని చూడవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. తొందరపాటుతో పెట్టే పెట్టుబడులతో నష్టం వాటిల్లవచ్చు. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వారం చివరలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

సింహం

సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల కారణంగా వృత్తి పరంగా ఆటంకాలు ఏర్పడతాయి. ఒక ముఖ్యమైన అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నందున అనుకూల శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. నమ్మించి మోసం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆస్తి, భూవివాదాలు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధతో లేకపోతే ప్రమాదం. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి.

కన్య

కన్యారాశి వారికి ఈ వారంలో శుభఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ముఖ్యమైన బాధ్యతలు స్వీకరిస్తారు. పెట్టుబడులు పెట్టినవారు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సామాజికంగా మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. ఊహించని లాభాలను అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకునే వారి కోరిక నెరవేరవచ్చు.ఇంటి అలంకరణ కోసం విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

తుల

తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. తీరికలేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వీడి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. చట్టపరమైన సమస్యలో చిక్కుకునే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో విభేదాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సమస్యలకు సంబంధించిన చర్చలలో సంయమనం పాటించడం అవసరం. వారం చివరలో వృత్తి పరంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అన్ని రంగాలవారికి వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి పట్ల మీరు చూపే అంకిత భావానికి ప్రశంసలు అందుకుంటారు. ఇన్ని రోజుల మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. కెరీర్, వ్యాపారం అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి. ఉద్యోగులు మీ పురోగతిని అడ్డుకునే ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాలలో ఇతరుల జోక్యం కూడదు. వారం చివరలో జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు

ఈ రాశి వారు ఈ వారం మాటలను అదుపులో ఉంచుకోవడం అవసరం. పనిపట్ల చిత్తశుద్ధి, శ్రద్ధ ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. భూమి స్థిరాస్తి వివాదాలను చట్టపరంగా కాకుండా శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు ఈ వారం అంత అనుకూలంగా కాదు. వ్యాపారంలో పోటీ సవాళ్లు ఎదురవుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

మకరం

మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు తీవ్రమైన కృషితో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి మరికొంత కాలం వేచి చూడాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వివాదాలకు దారితీయకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపించండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సన్నిహితుల మద్దతుతో విజయం సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని అధికంగా ధనవ్యయం చేస్తారు. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తిని ఈ వారం కలుసుకుంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి ఈ వారం కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. అదృష్టం వరించి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తే విజయం మీ సొంతం. ఉద్యోగులు స్వబుద్ధితో, సొంత నిర్ణయాలతో పనిచేస్తే శుభఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెంచుకుంటే మంచిది. జీతం పెరుగుదల ద్వారా అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆశించిన ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు.