Overseas Jobs | విదేశాల్లో టెక్నికల్ ఫీల్డ్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ ద్వారా కాంక్రీట్ 3డీ ప్రింటర్ ఆపరేటర్ ఉద్యోగాల నియామకం చేపడుతున్నారు. కేవలం ఇంటర్ అర్హతతోనే ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుండటం విశేషం.
ఈ కాంక్రీట్ 3డీ ప్రింటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.72 వేల నుంచి 83 వేల వరకు జీతం ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగంలో భాగంగా వారానికి 6 రోజులు.. రోజుకు 9 గంటల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది.
అర్హతలు
కనీసం ఇంటర్ లేదా డిప్లొమో పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారికి కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 58 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే, హిందీ, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉండటం అవసరం.
జాబ్ రెస్పాన్సిబిలిటీ
ఈ పోస్టుకు ఎంపికైన వారు 3డీ కాంక్రీట్ ప్రింటర్‌ను ఆపరేట్ చేయడం, మెటీరియల్ ఫ్లో, మిక్సింగ్ సరిగ్గా ఉన్నాయా? లేదా అన్నవి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రింటింగ్ సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించగలగాలి., మెటీరియల్ తయారీ, లోడింగ్ సహాయం చేయాలి. యంత్రాల నిర్వహణ, ప్రాథమిక చిక్స్ చేయగలగాలి.
దరఖాస్తు విధానం
అన్ని అర్హతలు గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com అడ్రస్‌కు మెయిల్ చేయాలని టామ్‌కమ్ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు 94400 51285, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Read More:
Pune Techie | 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!
ఒమన్‌లో నెలకు రూ.20 లక్షల జీతంతో జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి!
వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!
