DOST | దోస్త్ షెడ్యూల్ విడుదల.. కావాల్సిన ధృవపత్రాలు ఏంటి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
DOST | మీరు ఇంటర్( Inter ) పాసయ్యారా..? డిగ్రీ కోర్సుల్లో( Degree Courses ) చేరాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు..? డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ షెడ్యూల్( DOST Schedule ) విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ, కావాల్సిన ధృవపత్రాలు ఏంటి..? అనే తదితర విషయాలను తెలుసుకుందాం..

DOST | హైదరాబాద్ : తెలంగాణ( Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో( Degree Colleges ) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల నిమిత్తం దోస్త్ 2025 షెడ్యూల్( DOST 2025 Schedule ) విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దోస్త్ షెడ్యూల్( DOST Schedule ) ను విడుదల చేశారు. ఈ ఏడాది మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలను( Degree Admissions ) చేపట్టనున్నట్టు వివరించారు. ఇంటర్ పాసై డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులందరూ దోస్త్( DOST ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
3 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం.. ( DOST First Phase )
మే 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మే 29న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ ఫేజ్ మే 30 నుంచి జూన్ 8 వరకు.. ( DOST Second Phase )
సెకండ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ కోసం రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 13న రెండో దశ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 13 నుంచి 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
జూన్ 13 నుంచి 19 వరకు థర్డ్ ఫేజ్.. ( DOST Third Phase )
థర్డ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌కు రూ. 400 చెల్లించాలి. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 23న సీట్ల కేటాయింపు జరగనుంది. జూన్ 23 నుంచి 28 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
కావాల్సిన ధృవపత్రాలు ఇవే..( DOST Certificates )
దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ ధృవపత్రాలను తప్పనిసరిగా రెడీ చేసుకోవాలి.
1. ఇంటర్ హాల్ టికెట్ నంబర్
2. ఆధార్ కార్డు
3. ఎస్సెస్సీ మెమో
4. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు
5. బ్యాంకు పాస్ బుక్
దరఖాస్తు ప్రక్రియ ఎలా..? ( How to Apply DOST )
1. ప్రీ రిజిస్ట్రేషన్ ( DOST Pre Registration ) – ఇందులో విద్యార్థి ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఆధార్ కార్డు, ఎస్సెస్సీ మెమోలో ఉన్న వివరాలు పొందుపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థి బయో మెట్రిక్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
2. ఆన్‌లైన్ పేమెంట్ ( DOST Online Payment ) – ఆన్‌లైన్‌లో రూ. 200 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
3. ఫిల్లింగ్ అప్లికేషన్ – ఇక్కడ విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
4. వెబ్ ఆప్షన్స్( DOST Web Options ) – అప్లికేషన్ పూర్తి చేశాక.. వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. తాము తీసుకునే కోర్సులకు అనుగుణంగా.. ఆయా కాలేజీలను ఎంపిక చేసుకోని వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
5. సీట్ అలాట్‌మెంట్ ( DOST Seat Allotment )
డిగ్రీ అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులు నోటిఫికేషన్, దరఖాస్తు తేదీలు, దరఖాస్తు ఫీజు వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
TGS RTC Good News: హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్!
Inter Admissions | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూలు విడుదల.. అప్లై చేసుకోండిలా..!
Telangana | ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ సర్కార్! ఆదాయానికీ.. ఖర్చులకు కుదరని పొంతన