HCU PhD Notification | హెచ్‌సీయూ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..!

HCU PhD Notification | మీరు పీహెచ్‌డీ( PhD ) చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ( Hyderabad Central University ) లో చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. పీహెచ్‌డీ నోటిఫికేష‌న్( HCU PhD Notification ) విడుద‌లైంది.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

HCU PhD Notification | హెచ్‌సీయూ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..!

HCU PhD Notification | హైద‌రాబాద్ : ప్ర‌తి ఏడాది కొన్ని ల‌క్ష‌ల మంది గ్రాడ్యుయేట్లు( Graduates ), పోస్టు గ్రాడ్యుయేట్లు( Post Graduates ) త‌మ డిగ్రీ ప‌ట్టాల‌తో యూనివ‌ర్సిటీల( Universities ) నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగాలు( Jobs ) చేస్తే.. మ‌రికొంద‌రు నిరుద్యోగులుగా( Un employees ) మారిపోతున్నారు. ఇంకొంద‌రైతే.. పోస్టు గ్రాడ్యుయేట్‌తోనే ఆపేయ‌కుండా.. త‌మ విద్యాభ్యాసాన్ని కొన‌సాగిస్తున్నారు. నెట్‌( NET ), సెట్( SET ) వంటి అర్హ‌త‌లు సాధించేందుకు పుస్త‌కాలతో కుస్తీలు చేస్తారు. కొంద‌రు పీహెచ్‌డీ( PhD ) చేయాల‌ని నిర్దేశించుకుంటారు. ఆయా యూనివ‌ర్సిటీల్లో పీహెచ్‌డీ సీటు సాధించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తుంటారు. నెట్, సెట్ అర్హ‌త కలిగిన‌ వారికి సుల‌భంగా పీహెచ్‌డీ సీటు ల‌భిస్తుంది. ఈ అర్హ‌త‌లు లేని వారు పీహెచ్‌డీ అడ్మిష‌న్ కోసం ప్ర‌వేశ ప‌రీక్ష‌లు రాస్తుంటారు.

మ‌రి మీరు పీహెచ్‌డీ( PhD ) చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ( Hyderabad Central University ) లో చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ.. అదే హెచ్‌సీయూ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్( HCU PhD Notification ) విడుద‌లైంది. అర్హ‌త క‌లిగి ఉంటే.. ఆ పీహెచ్‌డీ నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి. అయితే 22 పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మ‌రో 19 పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ స‌ర్టిఫికెట్స్ క‌లిగి ఉంటే దాని ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

ముఖ్య‌మైన తేదీలు..

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ : ఏప్రిల్ 30
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ : మే 15 నుంచి
రాత ప‌రీక్ష : మే 31, జూన్ 1
అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల : జూన్ 20
ఇంట‌ర్వ్యూలు(హైబ్రిడ్ మోడ్‌) : జూన్ 30 నుంచి జులై 3 వ‌ర‌కు
ఇంట‌ర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల : జులై 21
అడ్మిష‌న్ కౌన్సెలింగ్ : జులై 30, 31
త‌ర‌గ‌తుల ప్రారంభం : ఆగ‌స్టు 1

ద‌ర‌ఖాస్తు ఫీజు ఇలా..

జ‌న‌ర‌ల్ కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు రూ. 600
ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ. 550
ఓబీసీ ఎన్‌సీఎల్ అభ్య‌ర్థుల‌కు రూ. 400
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ. 275

ఇక పీహెచ్‌డీ ద‌ర‌ఖాస్తు కోసం  acad.uohyd.ac.in/phd25july.html అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వాలి. 2025 ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో అభ్య‌ర్థి ఫొటో, సంత‌కం, ఎడ్యుకేష‌న‌ల్ స‌ర్టిఫికెట్స్, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతో పాటు ఇత‌ర ధ్రువ‌ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

రాత ప‌రీక్ష కేంద్రాలు ఇవే

భువ‌నేశ్వ‌ర్, కొచ్చి, పాట్నా, ఢిల్లీ, గుహ‌వ‌టి, కోల్‌క‌తా, హైద‌రాబాద్