JEE Main  | జేఈఈ మెయిన్-2026 పరీక్ష తేదీలు ఖరారు!.. రెండు సెషన్లుగా నిర్వహణ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main) 2026 ను రెండు సెషన్లలో నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. మొదటి సెషన్ జనవరి 2026 లో, రెండవ సెషన్ ఏప్రిల్ 2026 లో నిర్వహించనుంది. మొదటి సెషన్ లో జనవరి 21 నుండి జనవరి 30 వరకు.. ఏప్రిల్ 1 నుండి 10 వరకు రెండవ సెషన్ జరగనున్నట్టు NTA ఓ ప్రకటనలో పేర్కొంది.

  • By: TAAZ |    edu-career |    Published on : Oct 19, 2025 5:53 PM IST
JEE Main  | జేఈఈ మెయిన్-2026 పరీక్ష తేదీలు ఖరారు!.. రెండు సెషన్లుగా నిర్వహణ

JEE Main  | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main) 2026 ను రెండు సెషన్లలో నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. మొదటి సెషన్ జనవరి 2026 లో, రెండవ సెషన్ ఏప్రిల్ 2026 లో నిర్వహించనుంది. మొదటి సెషన్ లో జనవరి 21 నుండి జనవరి 30 వరకు.. ఏప్రిల్ 1 నుండి 10 వరకు రెండవ సెషన్ జరగనున్నట్టు NTA ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తుందని వివరించింది. ఒకవేళ మొదటి సెషన్‌కు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు, రెండవ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశ వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతోంది.

దరఖాస్తు ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు, అభ్యర్థులు కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని NTA గతంలోనే సూచించింది. ఆ అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు, దివ్యాంగులయితే UDID కార్డు, రిజర్వేషన్ కోటా కలిగి ఉన్నవారు EWS/SC/ST/OBC-NCL సర్టిఫికేట్స్ చెల్లుబాటయ్యేలా అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత వివరాల కోసం NTA అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను సందర్శించవచ్చునని ప్రకటనలో సూచించింది.