NEET Exam | నేడే NEET UG 2024 పరీక్ష.. పరీక్షా కేంద్రానికి ఇవి తప్పక తీసుకెళ్లాలి..!
NEET Exam | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 పరీక్ష ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. పరీక్ష నిర్వహణకు కూడా సర్వం సిద్ధం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.

NEET Exam : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 పరీక్ష ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. పరీక్ష నిర్వహణకు కూడా సర్వం సిద్ధం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు..
ముఖ్య సూచనలు..
- అభ్యర్థులు పరీక్షకు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- పరీక్ష కేంద్రానికి నీట్ అడ్మిట్ కార్డు, వాటర్ బాటిల్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతోపాటు పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ లేదా రేషన్ కార్డు లేదా మరేదైన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
- డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్‌లు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోపలికి అనుమతించరు.
- స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి.
- చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్టులు, టోపీలు లాంటివి ధరించరాదు.
- మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, మైక్రోఫోన్‌లు, బ్లూటూత్‌లు, ఇయర్‌ఫోన్‌లు లాంటి ఎలాక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- అదేవిధంగా చిన్న హ్యాండ్ శానిటైజర్ (50 మి.లీ.) ను కూడా తీసుకెళ్లవచ్చు.