Railway Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెస్త్ అర్హతతో రైల్వేలో 2,424 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Railway Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’లో భాగంగా 10వ తరగతి అర్హతతో ఖాళీగా 2,424 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది.

Railway Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’లో భాగంగా 10వ తరగతి అర్హతతో ఖాళీగా 2,424 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ rrccr.com లో ఆగస్టు 15లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో కోరింది. 10వ తరగతిలో 50శాతం మార్కులతో పాసైన వారంతా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
అయితే, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT), స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను (ఐటీఐ అప్రెంటిస్) సైతం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఇచ్చింది. ఎస్సీ – ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఇచ్చినట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. వయోపరిమితికి జూలై 15 కటాఫ్ తేదీగా పేర్కొంది. కాగా, అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేయనున్నారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సెంట్రల్ రైల్వే కోరింది.