Actor Suman : రాజకీయ ప్రవేశంపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు సుమన్ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీ ఆహ్వానం వచ్చిందని.. ఆలోచించి చెబుతానన్నారు.
Actor Suman | విధాత : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని..ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు నాకు టికెట్ ఇస్తామని కొందరు ఆహ్వానిస్తున్నారని సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుంటూరులో పర్యటించిన సుమన్ మీడియాతో మాట్లాడారు. నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే అన్నారు. అయితే అక్కడ ఎన్నికల్లో పోటీ అంశంపై ఆలోచించి చెబుతానని చెప్పడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ రాజకీయాలలో పోటీ విషయం అప్పుడే చెబుతానని సుమన్ తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఇందుకు అంతా సహకరంచాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయన్నారు. గతంలో ఏపీలో వైసీపీ, టీడీపీల నుంచి రాజమండ్రి ఎంపీగా సుమన్ కు ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram