Anna Lezhneva| పవన్ చెప్పులు మోసిన భార్య.. అన్నా లెజినోవా గ్రేట్ అంటున్న నెటిజన్స్
Anna Lezhneva|ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగరవేసిన తర్వాత ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పవన్ తన సతీమణి అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పూల వర్షం కురిపించి వారికి ఘన స్వాగతం పలికారు. పెద్ద అన్నయ్య చిరంజీ
Anna Lezhneva|ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగరవేసిన తర్వాత ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పవన్ తన సతీమణి అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పూల వర్షం కురిపించి వారికి ఘన స్వాగతం పలికారు. పెద్ద అన్నయ్య చిరంజీవి కనిపించగానే, వెంటనే తన కాళ్లకున్న చెప్పులు విడిచి మోకాళ్ల మీద కూర్చొని ఆయన కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో నాగబాబు కూడా చాలా ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటు తన తల్లి, వదినకు నమస్కరించే సమయంలోనూ ఆయన చెప్పులు విడిచారు. ఆ సమయంలో భర్త చెప్పుల్ని లెజినోవో తన చేతులతో తీసుకుని పక్కన నిలబడ్డారు. విదేశీ వనిత అయినప్పటికీ తన భర్త చెప్పులను తీసుకొని పట్టుకొని నిలుచోవడం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గొప్పతనానికి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. రష్యా అమ్మాయి అయినా, ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం గొప్పవిషయం అంటూ కామెంట్ చేస్తున్నారు. లెజినోవా తీరు చూసి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అన్నా లెజినోవా చాలా లో ప్రొఫైల్ లైఫ్ మెయింటైన్ చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. చాలా తక్కువగా ఆమె బయటకు వస్తుంది. ఎలక్షన్స్ సమయంలో ఓటు వేయడానికి పవన్‌తో వచ్చిన అన్నా లెజినోవా ఇటీవల రిజల్ట్స్ వచ్చినప్పుడు తన భర్తకి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఇంటి దగ్గరికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనలో కూడా ఆమె ఉన్నారు. ప్రధాని మోడీతో సమావేశంలోనూ పాల్గొని సందడి చేశారు. ఇక చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన బావగారికి పాదాభివందనం చేశారు. అలానే ఉపాసనని ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులితో సరదాగా గడిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram