Shatrughan Sinha | బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాకు అస్వస్థత..!
Shatrughan Sinha | బాలీవుడ్ సీనియర్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా (77) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన తనయుడు లవ్ సిన్హా తెలిపారు.
Shatrughan Sinha | బాలీవుడ్ సీనియర్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా (77) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన తనయుడు లవ్ సిన్హా తెలిపారు. ‘నాన్నకు తీవ్ర జ్వరంగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం. సాధారణంగా చేయించే అన్ని వైద్య పరీక్షలు చేయిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనే విషయంలో స్పష్టత లేదు. ఆయన కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన తన కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి ఇటీవల పెళ్లి చేసుకున్నది. జహీర్ ఇక్బాల్‌తో వివాహం జరిగిన కొద్దిరోజులకే శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు.
సోనాక్షి, జహీర్ జూన్ 23న కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. వివాహం తర్వాత, ఈ జంట రిసెప్షన్ పార్టీని కూడా నిర్వహించారు. ఇందులో బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఇద్దరూ ఏడేళ్లుగా డేటింగ్‌లో ఉండగా.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఇదిలా ఉండగా.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆయన టీఎంసీని నుంచి పోటీ చేసి గెలుపొందారు. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం విజయం సాధించారు. 1969లో శత్రఘ్న సిన్హా సినీరంగ ప్రవేశం చేశారు. ‘మేరే అప్నే’ ‘కాళీ చరణ్’, ‘విశ్వనాథ్’, ‘కాలా పత్తర్’, ‘దోస్తానా’ తదితర చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ అగ్ర హీరీల్లో ఒకరిగా నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram