Salam Anali | వార్ 2లో ఎన్టీఆర్..హృతిక్ రోషన్ డ్యాన్స్ రచ్చ …!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీతో మాస్ పులిహోర.. హృతిక్ రోషన్‌తో పోటీపడుతూ డ్యాన్స్ స్టెప్పులు వేసిన "దునియా సలాం అనాలి" పాట ప్రేక్షకులను ఊపేస్తోంది. వార్ 2పై అంచనాలు పెరిగిపోతున్నాయి!
Salam Anali | విధాత : బాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఎంట్రీ ఇచ్చిన వార్ 2(War2) సినిమా నుంచి తాజాగా ‘దునియా సలాం అనాలి’ (Dunia salam Anali) అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్(NTR, Hrithik Roshan) లు ఇద్దరు పోటాపోటి స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ పాట హుషారెత్తిస్తూ దూసుకపోతుంది. అయితే పూర్తి పాటను మాత్రం విడుదల చేయడం లేదని థియేటర్‌లోనే చూడాలని చిత్రబృందం కోరింది. హిందీలో హృతిక్, తెలుగులో ఎన్టీఆర్ డ్యాన్స్ లో మేటిగా భావిస్తుంటారు. అలాంటి ఇద్దరు ఒకే సినిమాలో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ పాటపై వారి అభిమానులలో ఆసక్తి వ్యక్తమవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా అద్వానీ, హృతిక్ రోషన్ లు నటించిన హిందీ సాంగ్ ‘అవాన్ జవాన్’(Aavan Jaavan)..తెలుగులో నీ గుండె గుమ్మంలోకి పాట యూత్ ను ఆకర్షిస్తూ సినిమాపై క్రేజ్ పెంచింది. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల పాటతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ నెల 14న వార్ 2 ప్రేక్షకులకు ముందు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram