Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ
బెంగుళూర్ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ నిజంగానే పట్టుబడిందని, తాను పార్టీలో లేనంటూ బుకాయించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన వ్యవహారశైలితో ఆమె టాలీవుడ్ పరువు తీసిందని నటి కరాటే కల్యాణి ఫైర్ అయ్యారు
విధాత, హైదరాబాద్ : బెంగుళూర్ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ నిజంగానే పట్టుబడిందని, తాను పార్టీలో లేనంటూ బుకాయించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన వ్యవహారశైలితో ఆమె టాలీవుడ్ పరువు తీసిందని నటి కరాటే కల్యాణి ఫైర్ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో మంచివారు..ఎన్నో మంచి పనులు చేసే వారున్నారన్నారు.
ఇటువంటి ఘటనలలో పట్టుబడిన ఒకరిద్దరితో ఇండస్ట్రీకి డ్రగ్స్, రేవ్ పార్టీల కల్చర్ ఆపాదిస్తూ చెడ్డపేరు వస్తుందన్నారు. రేవ్ పార్టీ కేసులో సాటి మహిళా నటిగా హేమ డ్రగ్ తీసుకోలేదని శాంపిల్స్ పరీక్షల్లో రుజువు కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. హేమపై తెలుగు అర్టిస్టు మూవీ ఆర్టిస్టు అసొసియేషన్ వేటు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆమె గతంలో ఇతరులపై చేసిన విమర్శల ఉసురు ఇప్పుడు ఆమెకు చుట్టుకుందన్నారు.
Also Read :
Bengaluru Rave Party | “రేవ్ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”
Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ
Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!
Hema| బెంగళూరు రేవ్ పార్టీలో హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగళూరు పోలీసులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram