Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసును ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లుగా నగర కమిషనర్ వెల్లడించారు.
ఇద్దరు నటుల రక్తనమూనాల సేకరణ.. ఐదుగురి అరెస్టు
విధాత: బెంగుళూర్ రేవ్ పార్టీ కేసును ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లుగా నగర కమిషనర్ వెల్లడించారు. డ్రగ్స్ పార్టీకి ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినట్లుగా సమాచారం లేదని, ఇద్దరు నటులు పార్టీలో దొరికారని తెలిపారు. ఆ ఇద్దరు నటులతో పాటు అనుమానితుల రక్త నమూనాలను తీసుకున్నామని, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కోన్నారు.
డ్రగ్ పెడ్లర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ముగ్గురు డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశామని, అలాగే నిర్వాహకుడు వాసును, అతని బంధువు ఈవెంట్ ఇంచార్జీ అరుణ్‌ను కూడా అరెస్టు చేశామని సీపీ తెలిపారు. గోపాల్‌రెడ్డి ఫామ్ హౌజ్‌లో వారు బర్త్‌డే సందర్భంగా సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ రేవ్ పార్టీ నిర్వహించారని, సిద్ధికి, రణధీర్, రాజ్ భవలు పార్టీలో డ్రగ్స్ విక్రయించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కోన్నారు.
కాగా.. 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు పార్టీలో పాల్గొన్నట్లుగా పేర్కోన్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు ప్రస్తావించలేదు. అయితే పట్టుబడిన వారిలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులతో పాటు పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులున్నట్లుగా తెలుస్తోంది. 20 కి పైగా లగ్జరీకారులను .ఎండిఎంఏ డ్రగ్, గంజాయి సహా ఆరు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read :
Bengaluru Rave Party | “రేవ్ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”
Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ
Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!
Hema| బెంగళూరు రేవ్ పార్టీలో హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగళూరు పోలీసులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram