విధాత:సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట చిత్రంలోని ఫస్ట్ లుక్ వచ్చేసింది. రెడ్ కలర్ కారులో నుంచి మహేశ్ బయటకు దిగుతున్నట్టుగా ఉన్న మాస్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ లుక్ ఫైట్ సీన్‌కి సంబంధించినది అని కారు అద్దాలు పగిలిన విధానాన్ని బట్టి అర్థమవుతోంది. ఇందులో మహేశ్ పొడవాటి చుట్టుతో, కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రీట్ కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న సూపర్‌స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు. బ్యాంకు కుంభకోణం నేపథ్‌యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస