Actor Sivakarthikeyan Car Accdient | చెన్నైలో శివకార్తికేయన్ కారు ప్రమాదం .. హీరోతో పాటు కుటుంబ సభ్యులు సేఫ్
Actor Sivakarthikeyan Car Accdient | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు చెన్నైలో ప్రమాదానికి గురైంది. నగరంలోని సెంట్రల్ కైలాష్ (మధ్య కైలాశ్) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టినట్లు సమాచారం.
Actor Sivakarthikeyan Car Accdient | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు చెన్నైలో ప్రమాదానికి గురైంది. నగరంలోని సెంట్రల్ కైలాష్ (మధ్య కైలాశ్) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శివకార్తికేయన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది.ఈ ప్రమాదంలో శివకార్తికేయన్‌కు గానీ, ఆయనతో ఉన్న ఇతరులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదంలో ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వెంటనే క్లియర్ చేశారు.ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హీరో సురక్షితంగా బయటపడటంతో ఫ్యాన్స్ ఊరట చెందుతున్నారు.తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన శివకార్తికేయన్, రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, అమరన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది విడుదలైన ‘అమరన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు.
అశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమాలో సాయి పల్లవి ఆయన భార్య పాత్రలో నటించి మెప్పించారు.ఇక శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పరాశక్తి’. ఇది ఆయన కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. సుధా కొంగర కథ, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. తాజా ప్రమాదం నుంచి హీరో క్షేమంగా బయటపడటంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Actor #Sivakarthikeyan‘s car met with a small accident near Madhya Kailash in Chennai due to heavy traffic, but no one was injured.
— Suresh PRO (@SureshPRO_) December 20, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram