Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగ వ్యాపారాల్లో కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. శ్రమ, పనిభారంతో ఒత్తిడికి లోనవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. రుణాలు చేయాల్సి వస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో, స్పష్టమైన ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్య సాధనకు మార్గం సుగమం అవుతుంది. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరంతర కృషితో ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన ఆర్ధిక లాభాలు రావడంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వాహనయోగం ఉంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. సహోద్యోగులు నుంచి సహకారాలు అందుతాయి. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తెలివితేటలతో, బుద్ధిబలంతో కీలకమైన పనులు చక్కబెడతారు. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిణామాలు ఉంటాయి. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న, చిన్న గొడవలతో మనశ్శాంతి లోపిస్తుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు కాదు. సోమరితనం, బద్దకం పనులకు ఆటంకాలుగా మారుతాయి. అస్థిర బుద్ధి వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడండి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచి పోతుంది. మిత్రులతో పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. ఈ రోజంతా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దైవబలంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక సంఘటన ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి. ఇష్టమైన వారితో మంచి సమయం గడుపుతారు. కుటుంబ వ్యహారాల్లో ఓర్పు, సహనం అవసరం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో ఆనందంగా పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ధనాదాయాలు ఉంటాయి. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పడం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో చోరభయం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు ప్రారంభించడానికి ఈ రోజు శుభప్రదమైన రోజు. అన్ని రంగాల వారికి వృత్తిపరంగా విశేషంగా లాభించవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు విశేషించి యోగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబం వాతావరణం సంతోషంగా ఉంటుంది. పితృవర్గం నుంచి ఆర్థికలబ్ది ఉండవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram