Allu Arjun | జపాన్‌లోనూ ‘పుష్ప’ పుష్పరాజ్ హవా.. అల్లు అర్జున్‌కు దక్కిన ఘన స్వాగతం
Allu Arjun | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పేరు ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో మార్మోగుతోంది. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఆయనకు అక్కడ కూడా ఎంతటి అభిమాన వలయం ఏర్పడిందో స్పష్టంగా చూపిస్తోంది.
Allu Arjun | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పేరు ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో మార్మోగుతోంది. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఆయనకు అక్కడ కూడా ఎంతటి అభిమాన వలయం ఏర్పడిందో స్పష్టంగా చూపిస్తోంది. కుటుంబంతో కలిసి ప్రైవేట్ ట్రిప్‌లో భాగంగా జపాన్ రాజధాని టోక్యోకు వెళ్లిన అల్లు అర్జున్, అక్కడ ఓ సుషీ రెస్టారెంట్‌ను సందర్శించారు. ఆ సమయంలో రెస్టారెంట్ సిబ్బంది ఆయనను ‘పుష్ప’ పుష్పరాజ్‌గా గుర్తించి ప్రత్యేకంగా స్వాగతం పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేవలం గుర్తుపట్టడమే కాకుండా, అల్లు అర్జున్‌కు ఇష్టమైన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి అందించడంతో పాటు ‘పుష్ప’ సినిమాను గుర్తు చేసే ప్రత్యేక డెజర్ట్‌ను కూడా ప్రెజెంట్ చేయడం విశేషం. జపాన్ అభిమానులు చూపించిన ఆతిథ్యం, ప్రేమ బన్నీని ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. ముఖ్యంగా అక్కడి యువత ‘తగ్గేదే లే’ సిగ్నేచర్ స్టైల్‌ను అనుకరిస్తూ, అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇండియన్ సినిమాలంటే జపాన్ ప్రజలకు మొదటి నుంచీ ప్రత్యేకమైన అభిమానం ఉంది. రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్‌కు అక్కడ మంచి ఫ్యాన్‌బేస్ ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా బలంగా చేరారు. ‘పుష్ప: ద రైజ్’ సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకుని పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, ఇప్పుడు గ్లోబల్ ఐకాన్‌గా మారుతున్నాడు. జపాన్ వంటి దేశాల్లో లభిస్తున్న ఈ ఆదరణ అతడిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ‘పుష్ప 2’ విషయానికి వస్తే, ఈ సినిమా ఇప్పటికే జపాన్‌లో విడుదలైంది. అక్కడి ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చిత్రాన్ని నేరుగా జపనీస్ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం. జపాన్ మార్కెట్‌లో ‘పుష్ప’ సిరీస్‌కు లభిస్తున్న స్పందన, అల్లు అర్జున్ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ 2024 డిసెంబర్ 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ‘పుష్ప 3’పై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు షూటింగ్స్, ప్రమోషన్ల హడావుడి నుంచి కొంత విరామం తీసుకున్న అల్లు అర్జున్, తన భార్య స్నేహా రెడ్డి మరియు పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆయన ఫేమ్ వెంటాడుతుండడం విశేషంగా మారింది. జపాన్ పర్యటన ముగిసిన తర్వాత అల్లు అర్జున్ తిరిగి భారత్‌కు రానుండగా, అట్లీతో పెండింగ్ షూటింగ్‌లు పూర్తి చేసి, త్రివిక్రమ్, సందీప్ వంగా, సుకుమార్ వంటి దర్శకులతో భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్‌తో చేసే తదుపరి సినిమాపై బన్నీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram