Allu Sirish | అల్లు శిరీష్ పెళ్లి తేది ఫిక్స్.. అల్లు ఫ్యామిలీలో మళ్లీ మార్చి 6 మ్యాజిక్!
Allu Sirish | అల్లు అరవింద్ మూడో తనయుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అల్లు శిరీష్, తాజాగా తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అల్లు శిరీష్ 2026 మార్చి 6వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
Allu Sirish | అల్లు అరవింద్ మూడో తనయుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అల్లు శిరీష్, తాజాగా తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అల్లు శిరీష్ 2026 మార్చి 6వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని వెల్లడించే విధానం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తన అన్న అల్లు అర్జున్ పిల్లలు, అలాగే పెద్దన్న పిల్లలు కలిసి ట్రెండింగ్‌లో ఉన్న ఓ పాటకు డాన్స్ చేస్తూ పెళ్లి డేట్‌ను రివీల్ చేసిన వీడియోను అల్లు శిరీష్ షేర్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన ఈ ఫన్ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.ఇందులో మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, అల్లు శిరీష్ ఎంచుకున్న పెళ్లి తేదీ అల్లు ఫ్యామిలీలో ఇప్పటికే ప్రత్యేక స్థానం కలిగిన రోజు కావడం. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6న జరగడం విశేషం. ఇప్పుడు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే తేదీన అల్లు శిరీష్ పెళ్లి జరగబోతుండటంతో, ‘మార్చి 6’ అల్లు ఫ్యామిలీకి లక్కీ డేట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి డేట్ ప్రకటించిన వెంటనే అల్లు శిరీష్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, అల్లు ఫ్యామిలీలో మరోసారి ఘనంగా జరగబోయే వేడుకపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరుగుతోంది. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పెళ్లి ఏర్పాట్లతో పాటు కెరీర్‌పై కూడా దృష్టి పెట్టిన అల్లు శిరీష్, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అల్లు ఫ్యామిలీలో మరో పెళ్లి వేడుకతో రాబోయే రోజులు మరింత సందడిగా మారనున్నాయి.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram