Anasuya | అన‌సూయ త‌గ్గేలా లేదుగా.. ట్రోల‌ర్స్‌కి కౌంట‌ర్‌గా స్విమ్ షూట్ వీడియో షేర్ చేసిన యాంక‌రమ్మ‌

Anasuya |  హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్–నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా స్పందించడంతో, ఈ వివాదం కాస్తా శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు కౌంటర్లు వేస్తూ, ట్వీట్లు–పోస్టులతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

  • By: sn |    movies |    Published on : Dec 26, 2025 4:13 PM IST
Anasuya | అన‌సూయ త‌గ్గేలా లేదుగా.. ట్రోల‌ర్స్‌కి కౌంట‌ర్‌గా స్విమ్ షూట్ వీడియో షేర్ చేసిన యాంక‌రమ్మ‌

Anasuya |  హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్–నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా స్పందించడంతో, ఈ వివాదం కాస్తా శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు కౌంటర్లు వేస్తూ, ట్వీట్లు–పోస్టులతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ తొలుత స్పందిస్తూ, “మహిళలు ఎలా బట్టలు వేసుకోవాలన్నది ఎక్కడ రాసి ఉంది?” అని ప్రశ్నించారు. ఇక్కడ అసలు సమస్య దుస్తులు కాదని, క్యారెక్టర్, బిహేవియర్ మాత్రమే ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు అనసూయను టార్గెట్ చేస్తూ, మహిళల హక్కులపై మాట్లాడే అర్హత ఆమెకు లేదంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

గతంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు, ఇంటర్వ్యూలు, ‘జబర్దస్త్’ షో వీడియోలను తెచ్చి ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రోలింగ్‌కు అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రోలర్లకు గట్టి కౌంటర్‌గా తాజాగా స్విమ్ షూట్‌లో ఉన్న ఓ పాత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
“నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నా ట్రావెల్ డేస్‌ని చాలా మిస్ అవుతున్నాను. త్వరలోనే ఒక హాలిడే ప్లాన్ చేయాలి” అంటూ క్యాప్షన్ జత చేశారు. ఆ వీడియోలో అనసూయ బ్లాక్ స్విమ్ షూట్ ధరించి, చిన్న స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ కనిపించారు.

హీరోయిన్ల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై చర్చలు నడుస్తున్న వేళ, అనసూయ కావాలనే ఈ వీడియో పోస్ట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోకు ముందు ఆమె సాంప్రదాయ చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసి, వెంటనే స్విమ్ షూట్ వీడియో అప్లోడ్ చేయడం గమనార్హం. దీంతో “మహిళ ఏ దుస్తులు వేసుకున్నా అది ఆమె వ్యక్తిగత ఎంపికే” అన్న సందేశాన్ని అనసూయ బలంగా చెప్పాలనుకుంటోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా… ఈ వివాదం ఎటు దారితీస్తుందో, శివాజీ నుంచి మరో స్పందన వస్తుందో చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం—హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై మొదలైన ఈ చర్చ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)