Bigg Boss 9 | టాప్ 5 ఫైనలిస్ట్‌లు ఖరారు .. ప్రైజ్ మనీని రివీల్ చేసిన నాగార్జున
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డే 98 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. “ఆలస్యం లేకుండా మన టీవీ” అంటూ ఎపిసోడ్‌ను ప్రారంభించిన నాగార్జున, ఈ సీజన్ విన్నర్‌కు అందే ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఇంటికి తీసుకెళ్లేది రూ.50 లక్షల నగదు ప్రైజ్‌తో పాటు మారుతి సుజుకీ విక్టోరిస్ కారు అని ప్రకటించారు.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డే 98 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. “ఆలస్యం లేకుండా మన టీవీ” అంటూ ఎపిసోడ్‌ను ప్రారంభించిన నాగార్జున, ఈ సీజన్ విన్నర్‌కు అందే ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఇంటికి తీసుకెళ్లేది రూ.50 లక్షల నగదు ప్రైజ్‌తో పాటు మారుతి సుజుకీ విక్టోరిస్ కారు అని ప్రకటించారు. ఈ సందర్భంగా “మీరు విన్నర్ అయితే ఈ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ఐదుగురిలో ఎవరికి ఎంత ఇచ్చి పంపుతారు?” అని నాగార్జున కంటెస్టెంట్లను ప్రశ్నించారు. దీనికి ప్రతి ఒక్కరు తమ తమ భావోద్వేగాలతో సమాధానాలు ఇచ్చారు. భరణి ఓల్డేజ్ హోమ్‌కు కొంత మొత్తం ఇస్తానని, ఇమ్మూకి రూ.20 లక్షలు ఇస్తానని తెలిపాడు. ఇమ్మూ మాత్రం ఇంటి అప్పులు తీర్చుకుంటానని, తనను నమ్మిన అమ్మాయిని పీజీ వరకు చదివిస్తానని చెప్పాడు. అలాగే అక్క పిల్లలు, అన్నయ్య బాధ్యతలు తీసుకుంటానని, భరణికి రూ.20 లక్షలు ఇస్తానని వెల్లడించాడు.
డెమోన్ తన తండ్రికి టంగ్ క్యాన్సర్ చికిత్సకు, తణుకులో ఇల్లు కట్టడానికి డబ్బు వాడుకుంటానని చెప్పాడు. కామనర్ కావడంతో కళ్యాణ్‌తో రూ.25 లక్షలు షేర్ చేసుకుంటానని, రీతూకి గిఫ్ట్ కోసం రూ.5 లక్షలు ఖర్చు పెడతానని అన్నాడు. సంజన వచ్చిన మొత్తాన్ని ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఇవ్వడంతో పాటు, నడవలేని వారికి లింబ్స్ కొనిపెడతానని చెప్పింది. అలాగే తన పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, తనూజకు రూ.15 లక్షలు ఇస్తానని తెలిపింది. తనూజ మాత్రం ఎడ్యుకేషన్ లేని పిల్లల చదువులకు సహాయం చేస్తానని, డెమోన్‌కు రూ.15 లక్షలు ఇస్తానని చెప్పింది. కళ్యాణ్ తన తల్లికి గోల్డ్ కొనిపెడతానని, ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటానని, ఇమ్మూతో రూ.25 లక్షలు షేర్ చేసుకుంటానని అన్నాడు.
ఈ ఎపిసోడ్‌లో స్విమ్మింగ్ పూల్ టాస్క్ ద్వారా నెక్స్ట్ ఫైనలిస్ట్‌గా తనూజను నాగార్జున అనౌన్స్ చేశారు. అలాగే “న్యూ గాయ్ ఇన్ టౌన్” అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను ఆహ్వానించి, ఆయన కొత్త సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ సినిమాలో హీరో అనీష్‌ను పరిచయం చేయడం విశేషం. ఈ సినిమాకు నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తర్వాత ఈ సీజన్‌లోని ‘ది మోస్ట్ పాపులర్ సిట్యుయేషన్’లను రీక్రియేట్ చేసే టాస్క్‌ను నాగార్జున ఇచ్చారు. హౌస్‌లో జరిగిన గొడవలు, నామినేషన్ సీన్లను కంటెస్టెంట్లతో మళ్లీ చేయించారు. ఆ తర్వాత సుత్తితో గోడను పగలగొట్టే టాస్క్‌లో మూడవ ఫైనలిస్ట్‌గా డెమోన్ రివీల్ అయ్యాడు.
“హౌస్‌లో ఎవరి మీదైనా కంప్లైంట్ ఉంటే మీ కోపం తీర్చుకోండి.. ప్రతీ కంప్లైంట్‌కు ఒక ట్రీట్” అని నాగార్జున ప్రకటించడంతో హౌస్ మొత్తం సరదాగా మారింది. తనూజ ఇమ్మూపై కంప్లైంట్ చేసి కాఫీ పౌడర్ ట్రీట్ గెలుచుకుంది. ఈ సందర్భంగా నాగార్జున చేసిన సరదా వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. అనంతరం డెమోన్, ఇమ్మూ, భరణి, కళ్యాణ్, సంజన పరస్పరం కంప్లైంట్లు చేసుకున్నారు. తర్వాత నాలుగో ఫైనలిస్ట్‌గా ఇమ్మూను రివీల్ చేయగా, ఫీనిక్స్ బర్డ్ టాస్క్ ద్వారా చివరి ఫైనలిస్ట్‌గా సంజన నిలిచింది. భరణి ఈ దశలో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్స్ ఖరారయ్యారు. కళ్యాణ్, తనూజ, డెమోన్, ఇమ్మూ, సంజన టాప్ 5లో నిలిచారు. సంజనకు గుడ్ ఫైటింగ్ స్పిరిట్, డెమోన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇమ్మూ ఫైటర్, కళ్యాణ్‌కు హ్యాట్సాఫ్ అంటూ నాగ్ అభినందనలు తెలిపారు. ఆపై హౌస్‌లో టాప్ 5 సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram