Collections | స్టార్ హీరో సినిమాకి రూ.70 కోట్ల బడ్జెట్ .. కలెక్షన్స్ చూస్తే ఇంత దారుణమా అంటారు..!
Collections | ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో బడ్జెట్, స్టార్‌డమ్ కంటే కథా బలం ఎంత కీలకమో మరోసారి రుజువవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చిత్రాలు కూడా కంటెంట్ లేకపోతే తొలి వీకెండ్‌కే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అదే కొత్తదనం ఉన్న కథతో వచ్చిన సినిమాలు మొదట్లో పెద్దగా వసూళ్లు రాకపోయినా, పాజిటివ్ మౌత్ టాక్‌తో వారాల తరబడి నడుస్తున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి
Collections | ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో బడ్జెట్, స్టార్‌డమ్ కంటే కథా బలం ఎంత కీలకమో మరోసారి రుజువవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చిత్రాలు కూడా కంటెంట్ లేకపోతే తొలి వీకెండ్‌కే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అదే కొత్తదనం ఉన్న కథతో వచ్చిన సినిమాలు మొదట్లో పెద్దగా వసూళ్లు రాకపోయినా, పాజిటివ్ మౌత్ టాక్‌తో వారాల తరబడి నడుస్తున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదలైన ఒక భారీ చిత్రం ఇండస్ట్రీలో షాక్ ఇచ్చే స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
ఇటీవల కాలంలో డిజాస్టర్ సినిమాలుగా ‘ఏజెంట్’, ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’, ‘తమ్ముడు’ వంటి చిత్రాలు గుర్తుకు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ఇవి తమ ఖర్చులో చిన్న భాగం కూడా రికవరీ చేయలేకపోయాయి. అయితే ఈ జాబితాలోకి తాజాగా చేరిన మరో సినిమా పరిస్థితి మాత్రం వీటన్నింటికన్నా భిన్నంగా ఉంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘వృషభ’ చిత్రం, బడ్జెట్‌కు తగ్గ ఫలితం ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో తన పూర్తి రన్ ముగిసే సరికి కేవలం రూ.2 కోట్ల వరకే వసూలు చేయగలిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
విడుదలైన తొలి రోజే సినిమా గతి ఏంటో స్పష్టమైపోయింది. మొదటి రోజు వసూళ్లు కనీసం కోటి మార్క్‌ను కూడా దాటలేకపోవడం, రెండో రోజు నుంచి షోలను తగ్గించాల్సిన పరిస్థితి రావడం ఈ చిత్రానికి పెద్ద దెబ్బగా మారింది.ఇది మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే మోహన్‌లాల్‌కు దేశవ్యాప్తంగా బలమైన అభిమాన వర్గం ఉంది. అంతేకాదు, ఇటీవల ఆయన నటించిన కొన్ని చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. అలాంటి సమయంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రమే కాదు, ఆయన అభిమానులను కూడా థియేటర్లకు ఆకర్షించలేకపోయింది.
కన్నడ దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేపట్టినప్పటికీ, వసూళ్ల పరంగా ఎలాంటి లాభం దక్కలేదు. అదే సమయంలో ఇతర భాషల్లోనూ పరిస్థితి మారలేదు. భారీ తారాగణం, ద్విపాత్రాభినయం, పాన్ ఇండియా రిలీజ్ వంటి అంశాలు ఉన్నా కూడా కథ, కథనం, టెక్నికల్ క్వాలిటీ లోపాలు సినిమాను నిలబెట్టలేకపోయాయి.
మొత్తంగా చూస్తే, స్టార్ హీరో, పెద్ద బడ్జెట్, భారీ ప్రచారం… ఇవేవీ సరిపోవని ‘వృషభ’ ఉదాహరణగా నిలిచింది. ప్రేక్షకుడిని ఆకట్టుకునే కథ లేకపోతే, సినిమా ఫలితం ఎంత దారుణంగా ఉండొచ్చో చెప్పే హెచ్చరికలా ఈ చిత్రం ఇండస్ట్రీలో మిగిలిపోయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram