NTR | ఏంటి.. ఎన్టీఆర్‌ని అందరి ముందు అవమానించాడా.. ఎట్టకేలకి మారుతి క్లారిటీ
NTR | ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తోంది.
NTR | ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన తొలి సింగిల్ ‘రెబల్ సాబ్’ మంచి స్పందనను రాబట్టింది. అయితే పాట రిలీజ్ ఈవెంట్‌లో మారుతి మాట్లాడిన కొన్ని మాటలు ఊహించని వివాదానికి దారితీశాయి.
వివాదం ఎలా మొదలైంది?
పాట విడుదల కార్యక్రమంలో ప్రభాస్ భారీ కటౌట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ… నాకు ఇలా కాలర్ ఎగరేయడం అనే మాటలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా కూడా అది ప్రభాస్ కటౌట్ కి చాలా చిన్నదవుతుంది” అని మారుతి చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నిన్నటి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఎన్టీఆర్‌ని ఉద్దేశించే మారుతి ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా , వార్ 2 సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ తన రెండు కాలర్ లను పైకి లేపి చూపించిన విషయం తెలిసిందే.
అయితే మారుతి మాటలను కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ సిగ్నేచర్ ‘కాలర్ లిఫ్ట్’ గెశ్చర్‌ని పరోక్షంగా మారుతి టార్గెట్ చేసినట్టుగా భావించారు. వెంటనే సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండింగ్ మొదలైంది.ఒక అభిమాని.. కటౌట్ గురించి మాట్లాడాలి కాని, ఇతర హీరోలని ఎందుకు లాగారు అని ప్రశ్నించాడు. దానికి వెంటనే మారుతి స్పందించి క్షమాపణలు చెప్పాడు.
మారుతి క్షమాపణ
వివాదం ముదురుతుందని భావించిన మారుతి వెంటనే స్పందించారు. ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వక క్షమాపణలు. ఎవరి మనసును నొప్పించాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కొన్నిసార్లు భావం ఒకలా, మాటలు మరోలా వచ్చేస్తాయి. నా మాటలు తప్పుగా అర్థమయ్యాయి, దానికి నిజంగా చింతిస్తున్నాను అని అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న గౌరవాన్ని కూడా బయటపెట్టారు.
“ఎన్టీఆర్ గారి పట్ల, ఆయన అభిమానుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నా ఉద్దేశ్యం పొరపాటుగా అర్థమైంది. దయచేసి అర్థం చేసుకోండి.”అని తెలిపారు. ఈ వివరణ తర్వాత పరిస్థితి శాంతించగా, వివాదం పెద్దదిగా మారకుండా ముగిసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram