Director Maruthi | అడ్డంగా దొరికిన మారుతి.. అడ్రెస్ చెప్పి ఎంత ప‌ని చేశాడు..!

Director Maruthi |రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్–కామెడీ మూవీ గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది.

  • By: sn |    movies |    Published on : Jan 09, 2026 12:44 PM IST
Director Maruthi | అడ్డంగా దొరికిన మారుతి.. అడ్రెస్ చెప్పి ఎంత ప‌ని చేశాడు..!

Director Maruthi |రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్–కామెడీ మూవీ గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

ట్రైలర్, పాటలు, ప్రచార కార్యక్రమాలతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయినప్పటికీ, తెరపై కనిపించిన అవుట్‌పుట్ అంత స్థాయిలో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కథ ఆరంభమైన కొద్ది సేపటికే ఇంట్రెస్ట్ తగ్గిందని, కామెడీ ట్రాక్ సహజంగా కాకుండా బలవంతంగా నడిచినట్లు అనిపించిందని పలువురు ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓల్డ్ స్టైల్ స్క్రీన్‌ప్లే, నెమ్మదైన కథనం సినిమాకు మైనస్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవని, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని విమర్శలు వస్తున్నాయి.

సెకండాఫ్‌లో కథ కొంత ఊపందుకున్నప్పటికీ, క్లైమాక్స్‌కు వచ్చేసరికి ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు ఒక్కటైనా నిజంగా భయపెట్టే సీన్ లేకపోవడం నిరాశ కలిగించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రిలీజ్‌కు ముందు దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో సినిమా మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పిన మారుతి, అభిమానులు నిరాశ చెందితే నేరుగా తన ఇంటికే రావచ్చంటూ ధైర్యంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కొండాపూర్‌లో తన నివాస చిరునామాను కూడా బహిరంగంగానే వెల్లడించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడి ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమంటూ అప్పట్లో అభిమానులు ప్రశంసలు కురిపించారు.

కానీ సినిమా విడుదల తర్వాత మిక్స్‌డ్ నుంచి నెగటివ్ టాక్ రావడంతో పరిస్థితి పూర్తిగా మారింది. సోషల్ మీడియాలో మారుతిని లక్ష్యంగా చేసుకుని మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. “ఇంత బిల్డప్ ఇచ్చి ఇలాంటి అవుట్‌పుట్‌నా?” అంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా తీసి కూడా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో నిరాశపరిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. థమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆశించిన స్థాయిలో లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మారుతి చేసిన ఆ డేరింగ్ కామెంట్స్‌ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు, ట్రోలింగ్ హోరెత్తుతోంది. మొత్తంగా, ‘ది రాజా సాబ్’ సినిమా రిజల్ట్‌తో పాటు దర్శకుడి ప్రీ–రిలీజ్ ధీమా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్, వీకెండ్ కలెక్షన్లు సినిమాకు ఏ మేరకు మద్దతిస్తాయన్నది చూడాల్సి ఉంది.