Akhanda 2 | బాక్సాఫీస్‌పై ‘అఖండ 2’ తుపాను… సినిమా చూసి వ‌చ్చి బాల‌య్య‌కి అభిమాని ఫోన్

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్ష‌కుల‌లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారిద్ద‌రు క‌లిస్తే ప్రభంజ‌నం అని మరోసారి నిరూపితమవుతోంది. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత విడుదలైన ‘అఖండ 2’ అంచనాలను మించి స్పందన అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించగా, హౌస్‌ఫుల్ షోలతో అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది

  • By: sn |    movies |    Published on : Dec 12, 2025 4:30 PM IST
Akhanda 2 | బాక్సాఫీస్‌పై ‘అఖండ 2’ తుపాను… సినిమా చూసి వ‌చ్చి బాల‌య్య‌కి అభిమాని ఫోన్

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్ష‌కుల‌లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారిద్ద‌రు క‌లిస్తే ప్రభంజ‌నం అని మరోసారి నిరూపితమవుతోంది. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత విడుదలైన ‘అఖండ 2’ అంచనాలను మించి స్పందన అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించగా, హౌస్‌ఫుల్ షోలతో అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ఉన్న NRIs కూడా మాస్ ఫెస్టివల్ మూడ్‌లో థియేటర్లకు తరలి వచ్చారు. సోషల్ మీడియాలో సెలబ్రేషన్ వీడియోలు వైరల్ అవుతుండగా, ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.

అభిమానికి బాలయ్య ఫోన్ — వైరల్ వీడియో

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ప్రీమియర్ షో చూసిన ఒక అభిమాని సినిమా సందడి వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయగా… ఆశ్చర్యకరంగా బాలయ్య స్వయంగా స్పందించడంతో ఆ వీడియో క్షణాల్లో నెట్టింట హైలైట్ అయ్యింది. ఆ అభిమాని ఉత్సాహంగా మాట్లాడుతూ.. ఈ సారి “గూస్ బంప్స్ కాదు అండి… బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన్ బంప్స్ వచ్చాయి ” అని చెప్పగా, బాలయ్య నవ్వుతూ “థాంక్యూ సో మచ్” అంటూ స్పందించారు.

తరువాత ఆ అభిమాని.. ఇంటర్వెల్‌కు 10 నిమిషాల ముందు నుంచి సినిమా మరో లెవల్‌… ఇదే నిజమైన అఖండ తాండవం. యాక్షన్‌తో పాటు భక్తి కోణం అద్భుతం” అని చెప్పగా, బాలయ్య సంతోషంగా “సినిమా ఓవరాల్‌గా బాగుంది కదా?” అని అడిగారు. ఈ ఆప్యాయత నందమూరి ఫ్యాన్స్‌ను మరింత ఎమోషనల్ చేసింది.

బాక్సాఫీస్‌పై అఖండ తాండవం

ప్రస్తుత రిపోర్ట్స్ ప్రకారం, సినిమా మొదటి షో నుంచే అద్భుత వర్డ్ ఆఫ్ మౌత్ తెచ్చుకుంటోంది. వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాలలోను పీక్‌లో ఉండగా, మాస్ ఆడియన్స్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి విభాగం నుండి హిట్ టాక్ వస్తోంది. యాక్షన్, ఎమోషన్, డివోషన్ కలయికగా బోయపాటి మళ్లీ తన మాస్ టచ్ చూపించడంతో, ట్రేడ్ వర్గాలు బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు నెలకొనబోతున్నాయి అని భావిస్తున్నాయి. విడుదలైన రోజే ఇలా దుమ్ము రేపుతున్న ‘అఖండ 2’, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో సినీ పరిశ్రమ అంతా ఆసక్తిగా గమనిస్తోంది.