Janhvi Kapoor | త్వ‌ర‌లోనే ప్రియుడితో జాన్వీ క‌పూర్‌ పెళ్లి.. ఆమె తండ్రి ఏమంటున్నారంటే..!

Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తన స్నేహితుడు శిఖర్ పహారియాతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తన స్నేహితుడు శిఖర్ పహారియాతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వీరి వివాహం జరగనుందని, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.అయితే ఈ వార్తలపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని తెలిపారు.

జాన్వీ, శిఖర్ మధ్య అనుబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. మధ్యలో కొంతకాలం దూరమైనా, ఇప్పుడు మళ్లీ కలిసి కనిపిస్తున్నారు. కుటుంబ వేడుకలు, కార్యక్రమాల్లో శిఖర్ తరచూ కనిపించడం వారి బంధం బలాన్ని చూపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ తన ప్రేమ గురించి మాట్లాడుతూ, శిఖర్‌తో ఉన్నప్పుడు తాను ఎంతో సురక్షితంగా అనిపిస్తుందని, అతని ప్రేమ తనకు బలం ఇస్తుందని చెప్పారు. అయితే ఈ వార్త‌ల‌పై జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ నిర్మాత బోణీకపూర్‌ని ప్ర‌శ్నించ‌గా, అసలు విషయం బయటపడింది. ఆయన తన కూతురి పెళ్లి వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ కేవలం పుకార్లేన‌ని తేల్చి చెప్పారు.

బోనీ క‌పూర్ క్లారిటీతో జాన్వీ క‌పూర్ పెళ్లి వార్త‌ల‌కి పులిస్టాప్ ప‌డింది. జాన్వీ క‌పూర్ కెరీర్ బిజీగా ఉన్న స‌మ‌యంలో ఆమె పెళ్లి చేసుకుంటుంది అని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో అంతా షాక్ అయ్యారు. బోనీ క్లారిటీతో పుకార్లకి పులిస్టాప్ ప‌డింది. ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నారు. మొత్తానికి, పెళ్లి వార్తలు నిజం కాకపోయినా, జాన్వీ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Latest News