MSG | 5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

MSG | సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది

  • By: sn |    movies |    Published on : Jan 17, 2026 12:01 PM IST
MSG | 5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

MSG | సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లలో సెన్సేషనల్ రన్‌ను కొనసాగిస్తోంది.

కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ క్లబ్‌ను దాటడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఐదు రోజుల పూర్తి కలెక్షన్లను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.226 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ‘మన శంకర వరప్రసాద్ గారు’ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం కూడా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో, వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే 6వ రోజుకే 250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఎంత వరకు వెళ్లి ఆగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గ ఫ్యామిలీ ఎమోషన్, వినోదాన్ని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణ విలువలు కూడా చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా నిలబెట్టాయి. మొత్తంగా, మెగాస్టార్ చిరంజీవి మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ టచ్ కలగలిపిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తూ రికార్డుల వేట కొనసాగిస్తోంది.