Nikhil Swayambhu| నిఖిల్ ‘స్వయంభు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ‘స్వయంభు’ సినిమాను విడుదల చేయనున్నారు.
విధాత, నిఖిల్ (Nikhil)హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ (Swayambhu)విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఒక సినిమా.. రెండు సంవత్సరాల కష్టం.. పదుల సంఖ్యలో సెట్స్.. వేల సవాళ్లు.. అంటూ ‘స్వయంభు’ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ‘స్వయంభు’ సినిమాను విడుదల చేయనున్నట్లుగా తెలుపుతూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో స్వయంభూ చిత్ర నిర్మాణ ఘట్టాలు..యుద్ధ నేపథ్యం, భారీ సెట్స్తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచింది. నిఖిల్ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. పిరియాడికల్ మైథలాజిక్ వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యుద్దవీరుడిగా నటిస్తున్నారు.
సినిమా కథ గురించినిఖిల్ మాట్లాడుతూ, ‘‘ఇది కేవలం ఒక రాజు కథ కాదని, భారతీయ చరిత్రలో ఇది అంతగా తెలియని అధ్యాయం’’ అని అన్నారు. అంతేకాకుండా దీనిని భారతీయ సాంస్కృతిక గొప్పతనానికి నివాళిగా నిఖిల్ అభివర్ణించారు. ఈ పీరియాడికల్ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ఫేమస్ కెమెరామన్ కె.కె. సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram