OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోద విందు.. స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!

OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. రొమాన్స్, హారర్, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌లతో పాటు అభిమానుల కోసం తిరిగి వస్తున్న పాపులర్ వెబ్ సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి.

  • By: sn |    movies |    Published on : Dec 15, 2025 2:46 PM IST
OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోద విందు.. స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!

OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. రొమాన్స్, హారర్, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌లతో పాటు అభిమానుల కోసం తిరిగి వస్తున్న పాపులర్ వెబ్ సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి 20 మధ్య వివిధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కానున్న ముఖ్యమైన సినిమాలు, షోల వివరాలు ఇవే.

‘గుర్రం పాపిరెడ్డి’ – నవ్వుల వర్షం ఖాయం

దర్శకుడు మురళీ మనోహర్‌ తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ఆద్యంతం నవ్వులతో నిండిన ప్రయాణంలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ నిర్మించారు. బ్రహ్మానందం, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాతిపెట్టిన శవాన్ని వెలికి తీయడానికి శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన ఓ గ్యాంగ్‌ ఎదుర్కొనే అనూహ్య పరిణామాలే ఈ కథ. డిసెంబర్‌ 19న థియేటర్లలో విడుదల కానుంది.

‘సఃకుటుంబానాం’ – కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం

రామ్‌ కిరణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటించిన ‘సఃకుటుంబానాం’ను ఉదయ్‌ శర్మ దర్శకత్వం వహించారు. హెచ్‌. మహదేవ గౌడ్‌ నిర్మాతగా వ్యవహరించారు. రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మంచి కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ సినిమా కూడా డిసెంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ – విజువల్‌ వండర్‌కు మూడో భాగం

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవతార్‌’ ఫ్రాంచైజీకి మూడో భాగంగా ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ డిసెంబర్‌ 19న విడుదల కానుంది. దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ఈసారి కథను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. యాష్‌ ప్రపంచంలోని తెగలతో జేక్‌ కుటుంబం చేసే పోరాటం కథాంశంగా ఈ చిత్రం సాగనుంది. భారతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. అలాగే సస్పెన్స్‌ థ్రిల్లర్ ‘మిస్‌ టీరియస్‌’ కూడా డిసెంబర్‌ 19న థియేట‌ర్స్‌లోకి రానుంది.

ఓటీటీలోనూ వినోదం తగ్గేదేలే..

అఖిల్‌, తేజస్విరావ్‌ జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం డిసెంబర్‌ 18 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్‌ కానుంది. ప్రత్యేకంగా ఎక్స్‌టెండెడ్‌ కట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ఈటీవీ విన్‌ ప్రకటించింది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న ప్రధాన చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్ వీడియో

థామా (హిందీ మూవీ) – డిసెంబర్‌ 16

ఏక్‌ దివానే కీ దివానీయత్‌ (హిందీ) – డిసెంబర్‌ 16

ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) – డిసెంబర్‌ 17

ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ (వెబ్‌సిరీస్‌) – డిసెంబర్‌ 19

జీ5

నయనం (తెలుగు సిరీస్‌) – డిసెంబర్‌ 19

డొమినిక్‌ అండ్‌ ది లేడీస్‌ పర్స్‌ (మలయాళ మూవీ) – డిసెంబర్‌ 19

జియో హాట్‌స్టార్‌

మిసెస్‌ దేశ్‌ పాండే (హిందీ సిరీస్‌) – డిసెంబర్‌ 19

నెట్‌ఫ్లిక్స్‌

ప్రేమంటే (తెలుగు/హిందీ మూవీ) – డిసెంబర్‌ 19

ఎమిలీ ఇన్‌ పారిస్‌ సీజన్‌ 5 – డిసెంబర్‌ 18

రాత్‌ అఖేలీ హై (హిందీ మూవీ) – డిసెంబర్‌ 19

మొత్తంగా ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా వినోదం పక్కాగా సిద్ధంగా ఉంది.