OTT Movies | శ్రీరామనవమి స్పెషల్ రిలీజ్‌లు.. థియేటర్లలో సినిమాల జాతర, ఓటీటీల్లో ఏకంగా 19 స్ట్రీమింగ్స్!
OTT Movies | శ్రీరామనవమి పండుగ సమీపిస్తున్న వేళ సినీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు థియేటర్లు, ఓటీటీలు రెడీ అయ్యాయి. ఈ వారం థియేటర్లలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లు, సైకలాజికల్ థ్రిల్లర్స్, లవ్ స్టోరీలు వరుసగా రిలీజ్ కానుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా భారీగా కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
OTT Movies | శ్రీరామనవమి పండుగ సమీపిస్తున్న వేళ సినీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు థియేటర్లు, ఓటీటీలు రెడీ అయ్యాయి. ఈ వారం థియేటర్లలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లు, సైకలాజికల్ థ్రిల్లర్స్, లవ్ స్టోరీలు వరుసగా రిలీజ్ కానుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా భారీగా కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు
‘సుయోధన’ – సైకలాజికల్ థ్రిల్లర్
యంగ్ హీరో ప్రియదర్శి, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. హీరోకి మాత్రమే కనిపించే ప్రత్యేక శక్తి చుట్టూ తిరిగే కథ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మార్చి 27న విడుదల కానుంది.
‘బ్యాండ్ మేళం’ – యూత్ ఫుల్ లవ్ స్టోరీ
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం బావ-మరదళ్ల సరదా ప్రేమకథగా రూపొందింది. గ్రామీణ నేపథ్యంతో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ అవుతుంది.
‘G.O.A.T’ – కామెడీ లవ్ ఎంటర్‌టైనర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ చిత్రం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన కామెడీ లవ్ స్టోరీ. దివ్య భారతి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ కూడా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘హ్యాపీ రాజ్’ – అబ్బాస్ రీ ఎంట్రీ
జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంతో ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నారు. మార్చి 27న విడుదల కానుంది.
‘యూత్’ – స్కూల్ బ్యాక్‌డ్రాప్ మూవీ
కెన్ కరుణాస్ దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ చిత్రం స్కూల్ లైఫ్ చుట్టూ తిరిగే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. మార్చి 26న విడుదల.
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కంటెంట్
ఈ వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో భారీగా కంటెంట్ రిలీజ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో – బైట్ వెబ్ సిరీస్ (మార్చి 25), ప్రెటీ లేథల్ (మూవీ – మార్చి 25), హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 27), ఓ రోమియో (హిందీ మూవీ – మార్చి 27), విష్ణు విన్యాసం (తెలుగు మూవీ – మార్చి 20)
నెట్ ఫ్లిక్స్ – హార్ట్ బ్రేక్ హై సీజన్ 3 (మార్చి 25), హోమీ సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 25), ఇన్ సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ రియాలిటీ షో – మార్చి 23), సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 26), ద రెడ్ లైన్ (థాయ్ మూవీ – మార్చి 26), మర్దానీ 3 (బాలీవుడ్ మూవీ – మార్చి 27), డిటెక్టివ్ హోల్ (నార్వేజియన్ సిరీస్ – మార్చి 26).
జియో హాట్ స్టార్ – ది కమ్ బ్యాక్ (వెబ్ సిరీస్ – మార్చి 23), డేర్ డెవిల్ బోర్న్ అగైన్ 2 (వెబ్ సిరీస్ – మార్చి 24), కాట్టాన్ (తమిళ సిరీస్ తెలుగు డబ్బింగ్ – మార్చి 27), ద హన్నా మొంటానా 20th యానివర్సరీ స్పెషల్ (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 24), చిరాయ (వెబ్ సిరీస్).
జీ5 – ప్రజాపతి 2 (బెంగాళీ మూవీ – మార్చి 27), హే కాయ్ నవీన్ (మరాఠీ వెబ్ సిరీస్ – మార్చి 27), భానుప్రియ భూటర్ హోటల్ (బెంగాళీ మూవీ – మార్చి 26).
యాపిల్ టీవీ – ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్ – మార్చి 27)
ఆహా – అమరావతికి ఆహ్వానం (మార్చి 20)
సన్ నెక్స్ట్ – సీతా పయనం (మార్చి 19)
ఈటీవీ విన్ – సుమతీ శతకం (మార్చి 19), సీతారాములు (మార్చి 22).
సినీప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్
ఈ వారం థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ విభిన్న జానర్ల సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు పూర్తి వినోదం ఖాయం. ముఖ్యంగా పండుగ హాలీడేస్ ఉండటంతో ఈ రిలీజ్‌లు బాక్సాఫీస్‌కు కూడా మంచి బూస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, శ్రీరామనవమి సందర్భంగా సినీ ప్రపంచం పూర్తి వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram