Prabhas | ‘ఫౌజీ’ రిలీజ్‌పై అనిశ్చితి .. ప్రభాస్ సినిమాలపై నెలకొన్న గందరగోళం
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని ప్లాన్ చేసిన ప్రభాస్, తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తాడనే వార్తలు వినిపించాయి.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని ప్లాన్ చేసిన ప్రభాస్, తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్‌లో మార్పులు తప్పవని తెలుస్తోంది.
ఆగస్టులో రిలీజ్ కష్టమే!
‘ఫౌజీ’ సినిమా 2024లోనే సెట్స్ మీదకు వెళ్లినా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో షూటింగ్ పూర్తికాలేదని సమాచారం. ప్రభాస్ బిజీ షెడ్యూల్, ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో ఆగస్టు రిలీజ్ దాదాపు అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట. లేదంటే ‘ది రాజా సాబ్’ మాదిరిగా 2027 సంక్రాంతికి వాయిదా పడినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘ఫౌజీ’ ఆలస్యం.. ఇతర ప్రాజెక్టులపై ప్రభావం
‘ఫౌజీ’ ఆలస్యమవుతున్న కొద్దీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ కూడా లేట్ అవుతోంది. అదే సమయంలో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి 2898 AD పార్ట్ 2’ షూటింగ్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం వేచి చూస్తోంది.
ఇప్పటికే నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ పనులు ప్రారంభించి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, జెడి చక్రవర్తిలతో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ షూట్‌లో చేరిన వెంటనే అతని భాగాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇటలీకి ప్రభాస్.. రెస్ట్ మోడ్
ఇటీవల ప్రభాస్ సమ్మర్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. సుమారు 10–15 రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుని, ఆగస్టు 10 తర్వాత ‘కల్కి 2898 AD పార్ట్ 2’ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. దీంతో ‘ఫౌజీ’ షూటింగ్‌కు ఇంకా ఆలస్యం అవుతోంది. ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘సీతా రామం’ వంటి సెన్సిబుల్ చిత్రాలతో గుర్తింపు పొందిన హను రాఘవపూడి, ఈ సినిమాతో మరో ప్రత్యేక ప్రపంచాన్ని చూపించబోతున్నట్టు తెలిపారు.
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో భారీ అంచనాలు
ఈ సినిమా కథపై హను రాఘవపూడి ఇచ్చిన క్లూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “ఒకవేళ కర్ణుడు పాండవుల తరఫున యుద్ధం చేసి ఉంటే మహాభారతం ఎలా ఉండేది?” అనే ఆలోచనతో ఈ కథ రూపొందించానని ఆయన చెప్పారు.
కర్ణుడు పాత్ర ఆధారంగా ఊహాత్మకంగా రూపొందిస్తున్న ఈ కథ, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహాభారతంలో కర్ణుడు పాండవుల అగ్రజుడైనా, పరిస్థితుల వల్ల కౌరవుల వైపు నిలబడ్డాడు. అదే పాత్రను వేరే కోణంలో చూపించబోతున్నారని తెలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram