Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన, పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జీవితం, కుటుంబ వాతావరణం, అలాగే సినీ రంగంలోకి వచ్చిన ప్రయాణం గురించి మాట్లాడారు.
చిన్నప్పటి నుంచి తాను చాలా సైలెంట్‌గా, బయటి ప్రపంచంపై పెద్దగా అవగాహన లేకుండా పెరిగానని చరణ్ తెలిపారు. “అజ్ఞానం ఒక వరమైతే, దానికి నేనే ఉదాహరణ” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో సినిమా వాతావరణం అస్సలు ఉండేదే కాదని, షూటింగ్‌లు, అవార్డులు, సినీ మ్యాగజైన్‌లు అన్నీ ఇంటికి దూరంగానే ఉండేవని చెప్పారు.
ఆ క్రమశిక్షణ వల్లే..
మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అన్న విషయం కూడా చిన్నతనంలో తమకు పూర్తిగా తెలియదని రామ్ చరణ్ వెల్లడించారు. సినిమా పత్రికలను కూడా ముట్టుకోవడానికి భయపడేవాళ్లమని, నాన్న పిలిస్తే తప్ప షూటింగ్ సెట్స్‌కు వెళ్లే పరిస్థితి ఉండేదికాదని పేర్కొన్నారు. ఆ క్రమశిక్షణే తమను కొంతకాలం సినిమా ప్రపంచానికి దూరంగా ఉంచిందని చెప్పారు.
అయితే తన మనసులో మాత్రం నటుడు కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేదని చరణ్ తెలిపారు. కానీ ఆ విషయాన్ని నేరుగా తండ్రికి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయానన్నారు. ఒకసారి తన వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు చిరంజీవి పిలిచి “భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగారని గుర్తు చేసుకున్నారు.
మెకానికల్ ఇంజనీర్ అవుతానని చెప్పా…
“ఆ సమయంలో నటుడిని అవుతానని చెబితే నాన్న కోప్పడతారేమో అనిపించింది. అందుకే ఆయనను ఇంప్రెస్ చేయడానికి నేను మెకానికల్ ఇంజనీర్ అవుతానని చెప్పాను. కానీ నా మనసులో మాత్రం నటుడవ్వాలనే కోరిక ఉండేది” అని చరణ్ వెల్లడించారు.
అయితే తర్వాత పరిస్థితులు మారాయని, తన చదువు పూర్తయిన అనంతరం చిరంజీవే తనను నటన వైపు ప్రోత్సహించారని చెప్పారు. సరైన సమయంలో తండ్రి నుంచి వచ్చిన ఆ మద్దతు తన కెరీర్‌కు కీలక మలుపు అయిందని పేర్కొన్నారు.
పెద్ది జూన్ 4న..
రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “చరణ్ నిజంగానే మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉంటే తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయేది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చిరంజీవి కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ, విలువలను ప్రశంసిస్తున్నారు.
ఇక చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విడుదలకు ముందే సినిమా భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
