Ram Chran | నిజంగా రామ్ చరణ్‌ని అలా చూడగలమా.. ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తే వార్త
Ram Chran | ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని అందిపుచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ చిత్రంతో పలకరించిన ఈ సినిమా ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది.
Ram Chran | ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని అందిపుచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ చిత్రంతో పలకరించిన ఈ సినిమా ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. ఇక ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్దిపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందు నుంచే ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రతి అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఐపీఎల్ సమయంలో వైరల్ అయిన ‘పెద్ది షాట్’ టీజర్
ఏప్రిల్‌లో విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా “పెద్ది షాట్” అంటూ క్రికెట్ థీమ్‌తో రూపొందిన చిన్న ప్రోమో IPL మ్యాచ్‌ల సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఒక్క టీజర్‌తోనే సినిమా అంచనాలు కొత్త రేంజ్‌కు వెళ్లిపోయాయి.
ట్రెండింగ్ లో హుక్ స్టెప్
రీసెంట్‌గా విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. చిన్న పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తున్నారు. డిఫరెంట్ యాంగిల్స్‌లో స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మారింది.
పెద్ది క్లైమాక్స్‌పై ఆసక్తికర రూమర్స్
పెద్ది క్లైమాక్స్ గురించి టాలీవుడ్‌లో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌ని ఒక కాలు లేకుండా చూపించే అవకాశముందని, ఆ స్థితిలోనూ ఆయన గేమ్స్‌లో పాల్గొని భారత్‌కు మెడల్ తెస్తాడనే కథనం వినిపిస్తోంది. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అధికారిక సమాచారం ఎక్కడా లేదు. అభిమానులు ఇలాంటి ప్రయోగాన్ని ఎలా స్వీకరిస్తారనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈసారి ‘పెద్ది’పై రామ్ చరణ్ భారీగా నమ్మకాలు పెట్టుకున్నాడు.‘పెద్ది’కు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌తో హైప్ పెరుగుతుండడంతో, టాలీవుడ్ ప్రేక్షకులను రామ్ చరణ్ ఏ స్థాయి మ్యాజిక్‌తో అలరించబోతాడో అన్న ఉత్కంఠ భారీగా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram