Rekha Vedavyas | కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన రేఖ ఇలా అయిపోయిందేంటి.. మారిన లుక్ చూసి ఆశ్చర్యం

Rekha Vedavyas | టాలీవుడ్‌లో ఒకప్పుడు తన అందం, అమాయకమైన చిరునవ్వుతో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఆమె లుక్‌లో వచ్చిన మార్పు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

  • By: Sandeep |    movies |    Published on : May 01, 2026 10:32 AM IST
Rekha Vedavyas | కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన రేఖ ఇలా అయిపోయిందేంటి.. మారిన లుక్ చూసి ఆశ్చర్యం

Rekha Vedavyas | టాలీవుడ్‌లో ఒకప్పుడు తన అందం, అమాయకమైన చిరునవ్వుతో కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఆమె లుక్‌లో వచ్చిన మార్పు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రేఖ‌. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సంగీత పరంగా కూడా పెద్ద సెన్సేషన్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా ఆకాష్ నటించగా, రేఖ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా “ఆకాశం సాక్షిగా” పాటలో ఆమె చిరునవ్వు అప్పట్లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాలేదు..

‘ఆనందం’ తర్వాత రేఖ వేదవ్యాస్ వరుసగా అవకాశాలు అందుకుని ‘దొంగోడు’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి చిత్రాల్లో నటించి విజయాలు సాధించారు. తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు.

అయితే మంచి గుర్తింపు, అభిమానుల ప్రేమ దక్కినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చేసిన సినిమాల సంఖ్య తక్కువగానే ఉండటంతో పాటు, 2014 తర్వాత ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం పాటు ప్రజల కళ్లకు కనిపించని రేఖ, ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో కనిపించడం చర్చనీయాంశమైంది.

చిక్కిపోయింది ఏంటి..

తాజాగా బయటకు వచ్చిన ఫొటోల ప్రకారం, రేఖ వేదవ్యాస్ చాలా బరువు తగ్గిపోయి కనిపిస్తున్నారు. ఒకప్పుడు బొద్దుగా, ఎంతో చురుకైన లుక్‌తో కనిపించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆమె ఈ మార్పుకు కారణం ఆరోగ్య సమస్యలేనని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె చికిత్స తీసుకుంటూ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటే, మరికొందరు ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉంటున్నారు.

ఒకప్పుడు తెరపై మెరిసిన ఈ నటి ఇప్పుడు పూర్తిగా మారిపోయిన లుక్‌తో కనిపించడం సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకుని, తిరిగి ప్రజల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.