Trisha | విజయ్ రాజకీయ విజయానికి త్రిషే లక్కీ చార్మ్..? తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ జోడీ!

Trisha | తమిళ రాజకీయాల్లో ఊహించని సంచలనం సృష్టిస్తూ విజ‌య్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవుతారని కొందరు మాత్రమే అంచనా వేసినా, ఫలితాల్లో మాత్రం దళపతి విజయ్ సైలెంట్ సునామీలా దూసుకెళ్లారు. తమిళనాడులో అండర్‌కరెంట్‌గా నడిచిన విజయ్ వేవ్ ప్రత్యర్థి పార్టీలను ఆశ్చర్యానికి గురి చేసింది.

Trisha | తమిళ రాజకీయాల్లో ఊహించని సంచలనం సృష్టిస్తూ విజ‌య్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవుతారని కొందరు మాత్రమే అంచనా వేసినా, ఫలితాల్లో మాత్రం దళపతి విజయ్ సైలెంట్ సునామీలా దూసుకెళ్లారు. తమిళనాడులో అండర్‌కరెంట్‌గా నడిచిన విజయ్ వేవ్ ప్రత్యర్థి పార్టీలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ విజయానికి రాజకీయ విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నా, విజయ్ అభిమానులు మాత్రం ఒక ప్రత్యేకమైన కారణాన్ని హైలైట్ చేస్తున్నారు. అదే హీరోయిన్ త్రిష కృష్ణ‌న్. విజయ్ రాజకీయ విజయానికి త్రిషే “లక్కీ చార్మ్” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు వైరల్ చేస్తున్నారు.

అదే ట‌ర్నింగ్ పాయింట్..

విజయ్-త్రిష జోడీ తమిళ సినీ ప్రేక్షకులకు కొత్త కాదు. దాదాపు 22 ఏళ్ల క్రితం మొదలైన ఈ కాంబినేషన్ కోలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుంది. ముఖ్యంగా గిల్లీ నుంచి ఇటీవల వచ్చిన లియో వరకు వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యలో దాదాపు 15 ఏళ్ల పాటు ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా, వ్యక్తిగతంగా మాత్రం వారి స్నేహం కొనసాగిందనే ప్రచారం కోలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉంది.

అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే.. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తిరిగి త్రిషతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. అదే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ అయిందని అభిమానులు నమ్ముతున్నారు. “అన్న దశ మార్చిన దేవత” అంటూ సోషల్ మీడియాలో త్రిషపై అభిమానులు ప్రేమ కురిపిస్తున్నారు. విజయ్-త్రిష కాంబోను ఇప్పుడు చాలామంది “లక్కీ సింబల్”గా కూడా చూస్తున్నారు.

టీవీకేలో త్రిష‌…

2000ల తమిళ సినిమాలు చూసిన ప్రేక్షకులకు విజయ్-త్రిష అంటే ఒక ప్రత్యేకమైన ఎమోషన్. వీరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, పాటలు, ఫన్ మూమెంట్స్ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అందుకే ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.

ఇక రాజకీయాల పరంగా కూడా త్రిష పేరు ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆమె నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా, ఫలితాల రోజు తిరుమల వెళ్లడం, అదే రోజు విజయ్‌ను కలవడం, పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరచడం వంటి అంశాలు అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచాయి. ముఖ్యంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష కనిపించడంతో మీడియా దృష్టి మొత్తం ఆమెపై పడింది. విజయ్‌తో సమానంగా త్రిషను కూడా కెమెరాలు ఫాలో కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

ఇంకా ఆసక్తికరంగా, విజయ్ పార్టీ Tamilaga Vettri Kazhagam పేరు “TVK”ని అభిమానులు సరదాగా “త్రిష-విజయ్ కృష్ణన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పార్టీ పేరు పెట్టాడా?” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Latest News