Vinayak | చిరంజీవిపై విమర్శలు తగవు.. నంది అవార్డులపై ఆయన మాటలో తప్పులేదు: వీవీ వినాయక్ ఫైర్

Vinayak | హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు మళ్లీ ప్రారంభించాలని ఆయన చేసిన సూచనలపై కొందరు విమర్శలు గుప్పించగా, మరికొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ విషయంపై స్పందిస్తూ చిరంజీవికి మద్దతుగా నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “చిరంజీవి గారిపై ఇలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. ఆయన చెప్పిన దాంట్లో ఏ తప్పూ లేదు. ఒకప్పుడు నంది అవార్డులు ఎంతో వైభవంగా జరిగేవి. ఆ వేడుకలు పండుగలా ఉండేవి,” అని పేర్కొన్నారు.

ద‌గ్గ‌ర‌గా చూసిన వారికే తెలుస్తుంది..

అలాగే, “చిరంజీవి గారికి అవార్డులు అవసరం లేదు. కానీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన కోరుకున్నారు. అది తప్పు ఎలా అవుతుంది? ఆయనను విమర్శించే వారు తమ మాటలపై ఆలోచించుకోవాలి,” అని అన్నారు. ఇక చిరంజీవి స్థాయిని గుర్తుచేస్తూ, “ఐఏఎస్ అధికారుల నుంచి సాధారణ ప్రజల వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన శక్తి దగ్గరగా చూసిన వారికే తెలుస్తుంది,” అని వినాయక్ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక కార్యక్రమంలో స్వయంగా చిరంజీవిని కలవడం ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. “దేశం మొత్తం ఆయనను గౌరవిస్తుంటే, మనమే ఇలా విమర్శించడం సరైంది కాదు,” అంటూ వినాయక్ అసహనం వ్యక్తం చేశారు. నంది అవార్డుల పునరుద్ధరణపై చిరంజీవి అభిప్రాయం వ్యక్తిగతం కాదని, అది మొత్తం సినీ పరిశ్రమ ఆకాంక్ష అని వినాయక్ స్పష్టం చేశారు.

Latest News