Virosh | విరోష్ కపుల్ గొప్ప మనసు… చిన్నారిని ఇంటికి పిలిచి మ‌రీ ఫుల్ పార్టీ ఇచ్చారుగా..!

Virosh | స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేషనల్ క్రష్ ర‌ష్మిక మంధాన మరోసారి తమ గొప్ప మనసుతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అంటే ఏమిటో చూపిస్తూ, ఓ చిన్నారి ఫ్యాన్ కోరికను నెరవేర్చారు.

Virosh | స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేషనల్ క్రష్ ర‌ష్మిక మంధాన మరోసారి తమ గొప్ప మనసుతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అంటే ఏమిటో చూపిస్తూ, ఓ చిన్నారి ఫ్యాన్ కోరికను నెరవేర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

చిన్నారి కోసం ప్రత్యేక ఆహ్వానం

కొద్ది రోజుల క్రితం ఈ విరోష్ జంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగగా, అనంతరం హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వీట్లు పంచుతూ, అన్నదానాలు చేస్తూ అభిమానులకు దగ్గరయ్యారు. అయితే, ఈ వేడుకలకు తనను పిలవలేదని ఓ చిన్నారి క్యూట్‌గా బాధ వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “మనమూ ఫ్యాన్స్ కదా… నన్ను కూడా పిలవొచ్చు కదా” అంటూ ఆమె అమాయకంగా అడిగిన మాటలు అందరినీ కదిలించాయి.

మాట ఇచ్చిన విజయ్… నిలబెట్టుకున్నాడు

ఆ వీడియో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. “బుజ్జి తల్లీ… ఇంటికి లంచ్‌కు పిలుస్తా. నీకు ఇష్టమైన ఫుడ్ చెప్పు” అంటూ రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఆ చిన్నారిని ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన చిన్నారిని విజ‌య్‌,ర‌ష్మిక‌లు ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ఎత్తుకుని ముద్దాడుతూ, స్నేహంగా మాట్లాడుతూ చిన్నారితో సమయం గడిపారు. ఆమెకు ఇష్టమైన లడ్డూలు, పులిహోర వంటి వంటకాలను ప్రత్యేకంగా వడ్డించారు.

విజయ్ చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తుంటే, రష్మిక ముద్దులు పెట్టి ఆప్యాయత చూపించారు. “ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కదా” అంటూ ఆమెతో మాట్లాడటం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. చిన్నారి కూడా అమాయకంగా స్పందిస్తూ, “ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకుని బజ్జుంటా” అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.

నెటిజన్ల ప్రశంసలు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఈ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “చిన్నారి కల నిజం చేశారు”, “ఇలాంటి స్టార్స్ చాలా అరుదు”, “విరోష్ కపుల్ నిజంగా గోల్డెన్ హార్ట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ప‌నుల ద్వారా అభిమానులతో తమ బంధాన్ని మరింత బలంగా చేసుకుంటున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌. స్టార్ స్టేటస్ ఉన్నా, అభిమానుల భావాలను గౌరవించడం ద్వారా ఈ జంట మరోసారి ప్రత్యేకతను చాటుకుంది.

Latest News