OTT| ఈ వారం థియేటర్స్‌లో సందడి తక్కువ.. ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు
ఏప్రిల్ మూడో వారంలోకి అడుగుపెట్టాం. పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు.ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ అంతగా అలరించలేకపోయింది.ఇక ఈ వారం అయితే థియేటర్స్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.టెనంట్ ఏప్రిల్ 18న విడుదల కానుండగా, ఏప్రిల్ 19న పారిజాత పర్వం, శశివదనే చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలపై ప్రేక్షకులలో పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ కానుండడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ సినిమాలు ఆసక్తికరంగా మారాయి. ఇక మధ్యలో కొన్ని సినిమాలని కూడా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ‐ సిరీస్ లు (ఏప్రిల్ 15వ తేది నుండి ఏప్రిల్ 21 వరకు)
జీ5
సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ ..హిందీ మూవీ ఏప్రిల్ 16
కమ్ చాలు హై హిందీ సినిమా ఏప్రిల్ 19 నుండి
డిమోన్స్ అనే హిందీ చిత్రం ఏప్రిల్ 19 నుండి
సోనీ లివ్
క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్.. ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ 15 నుండి
నెట్ ఫ్లిక్స్
ఎనీవన్ బట్ యూ ..ఇంగ్లీష్ చిత్రం ఏప్రిల్ 15 నుండి
అవర్ లివింగ్ వరల్డ్ ..ఇంగ్లీస్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి
ద గ్రిమ్ వేరియేషన్స్ .. జపనీస్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి
రెబల్ మూన్: పార్ట్ 2 ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 19 నుండి
డిస్నీ హాట్ స్టార్
సీయూ ఇన్ ఎనదర్ లైఫ్ .. స్పానిష్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి
ద సీక్రెట్ స్కోర్ స్పానిష్ సిరీస్ ఏప్రిల్ 17 నుండి
చీఫ్ డిటెక్టివ్ 1958 కొరియన్ సిరీస్ ఏప్రిల్ 19 నుండి
సైరన్ ..తెలుగు డబ్బింగ్ చిత్రం ఏప్రిల్ 19 నుండి
జియో సినిమా
ది సింపథైజర్ .. ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ 15 నుండి
ఆర్టికల్ 370 హిందీ మూవీ ఏప్రిల్ 19 నుండి
ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ ( ఇంగ్లీష్ సిరీస్) ఏప్రిల్ 19 నుండి