ఇక రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ పని అయిపోయినట్లేనా.?
ఊహించినట్లే, గేమ్‌ఛేంజర్(Game Changer Movie) విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈసారి దెబ్బ విశ్వంభర(Vishwambhara) మీద. జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి సినిమాను ఇంకా వెనక్కిపంపి, ఆ తేదీని గేమ్‌చేంజర్ ఆక్రమించింది. జరగండి.. జరగండి… అంటే ఎవరినో అనుకున్నాం. విశ్వంభర అని అనుకోలేదు.
అంతా అనుకున్నట్లుగానే జరిగింది. రామ్‌చరణ్ – శంకర్ల మూవీ గేమ్‌చేంజర్ వాయిదాల పర్వం కొనసాగుతూనేఉంది. ఈసారి తేదీ జనవరి 10, 2025. బలైంది హీరో నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర ఆ తేదీన విడుదల కావాల్సిఉంది. అంతా రెడీ చేసుకున్నారు కూడా. కానీ గేమ్‌చేంజర్ పూర్తి కాదు కదా. శంకర్ బలిమేకల లిస్టులో రామ్‌చరణ్(Shankar’s Scape goat) చేరిపోయాడు. ఇండియన్ 2, 3(Indian2 & 3) కోసం గేమ్చేంజర్ను శంకర్ పక్కనపెట్టేసాడని అభిమానులు ఆవేశపడ్డారు. అభిమానులు, దిల్ రాజు ఈ సినిమాను వదిలేసుకుంటే, ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు.
ఇప్పుడు గేమ్‌చేంజర్‌కు మరో బలి – విశ్వంభర. గేమ్‌చేంజర్‌కు దారి ఇవ్వడం కోసం చిరంజీవి(Megatar Chiranjeevi) ఏకంగా మే9, 2025కు వెళ్లిపోయాడని సమాచారం. మే9 ఆయనకు అచ్చొచ్చిన రోజు. జగదేకవీరుడు సహా చిరంజీవి భారీ హిట్ చిత్రాలు మే9నే విడుదలయ్యాయి. కానీ, టీజర్(Teaser) ఫలితం మరోలా వస్తోంది. విశ్వంభర గ్రాఫిక్స్(Graphics trolled)ను సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్నారు. సీన్ టు సీన్‌ను పోస్ట్‌మార్టం చేసి, ఏది ఎక్కన్నుంచి ఎత్తేసారు? సిజీ వర్క్ నాణ్యత మరీ నాసిరకంగా ఉందని.. రకరకాల పోస్టులు షేర్ల మీద షేర్లు అవుతున్నాయి. టైమ్ ఇంకా వుంది కాబట్టి, వశిష్ట వీటిని బాగుచేసుకుంటే బెటర్ అనే సలహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆదిపురుష్ దర్శకుడు ఓం రావత్‌తో వశిష్టను పోలుస్తున్నారు.

ఇక గేమ్‌చేంజర్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీలేదని, వచ్చినప్పుడు వచ్చి, ఎవరికీ తెలియకుండా వెళ్లిపోతుందని సినీవర్గాల గుసగుసలు. ఇక రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమా మీద కాన్సంట్రేట్ చేయడం చాలా మంచిదని అంటూ, శంకర్ రాజమౌళి(SS Rajamouli) మీద ఉన్న అసూయను రామ్‌చరణ్ మీద తీర్చుకుంటున్నాడని కూడా అభిమానులు ఓ మెట్టు ఎక్కి మరీ కామెంట్లు పెడుతున్నారు.
Tags: .
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram