Rasha Thadani Debut : ఘట్టమనేని వారసుడితోనే రవీనా టాండన్ కుమార్తె రాషా టాలీవుడ్ ఎంట్రీ!
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ ఘట్టమనేని రమేష్‌బాబు–జయ కృష్ణ అజయ్ భూపాటి సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ!
Rasha Thadani Debut | విధాత : బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో బాలయ్య పక్కన బంగారు బుల్లోడు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసింది. . ఆకాశ వీధిలో, రథసారథి, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లోను నటించింది. ఆ మధ్యన కేజీఎఫ్ 2 సినిమాలో రమికా సేన్ పాత్రతో మరోసారి దక్షిణాది ఆడియెన్స్ ను అలరించింది. రవీనా టాండన్ వారసురాలిగా ఆమె కూతురు రాషా థడానీ ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవగన్ మేనల్లుడైన అమన్ దేవ్‌గన్ జంటగా ‘ఆజాద్’ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రాషా టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. రాషా థడానీ ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ – అజయ్ భూపాతి కాంబో లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
రాషా థడానీ సినిమాల్లోకి రాకముందే ఎకో-లవర్‌గా, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా, కరాటే గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లలో తల్లి తరహాలోనే తాను కూడా సినిమాల్లో సత్తా చాటాలని తహతహాలాడుతుంది. మరి రవీనా టాండన్ ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు రాషా థడానీకి ఎంతమేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram