అనకాపల్లి పట్టణంలో గ్లామర్, గ్రాండ్ సెలబ్రేషన్ మధ్య ‘శుభప్రదం షాపింగ్ మాల్’ కొత్త బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 3న జరిగిన ఈ వేడుకలో హీరోయిన్స్ మానస వారణాసి, శ్రీదేవి జాబిలి పాల్గొని మాల్‌ను ప్రారంభించడంతో ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ హాజరై నిర్వాహకులను అభినందించారు.
అనకాపల్లిలో అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్‌గా రూపుదిద్దుకున్న ‘శుభప్రదం’ మాల్‌లో కుటుంబమంతటికీ కావాల్సిన వస్త్రాలు, బ్రాండెడ్ కలెక్షన్స్, ట్రెండీ డిజైన్లు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. విశాలమైన షాపింగ్ స్పేస్, ఆధునిక సౌకర్యాలు, అందుబాటు ధరలు ఈ మాల్ ప్రత్యేకతలు. హైదరాబాద్ తరహా షాపింగ్ అనుభూతిని స్థానికులకు అందించాలనే లక్ష్యంతో ఈ మాల్‌ను ఏర్పాటు చేశారు.
మాల్ అధినేత అల్లాక సత్యనారాయణ మాట్లాడుతూ… నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరల్లో అందించడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మాల్ ద్వారా 100 మందికిపైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకుంటున్నారు. షాపింగ్‌కు కొత్త అనుభవాన్ని అందించే ఈ మాల్ అనకాపల్లిలో కొత్త ఆకర్షణగా నిలవనుంది.
