Tamannaah Bhatia| చిక్కుల్లో పడ్డ హీరోయిన్ తమన్నా.. సైబర్ క్రైమ్ నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటంటే..!
Tamannaah Bhatia| టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా సినిమా కెరీర్ ప్రారంభించి సుమారు 20 ఏళ్లు కావోస్తున్నప్పటికీ మిల్కీ బ్యూటీ గ్లామర్ ఏ మా
Tamannaah Bhatia| టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా సినిమా కెరీర్ ప్రారంభించి సుమారు 20 ఏళ్లు కావోస్తున్నప్పటికీ మిల్కీ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. తమన్నా అంటే హిందీలో ‘కోరిక’ అని అర్థం వస్తుంది.. ఈ అమ్మడు 8-9 ఏళ్ల వయసున్నప్పుడే హీరోయిన్ కావాలని భావించిందట. అన్నీ అనుకున్నట్లుగానే టీనేజ్‌లోకి వచ్చేసరికి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఇక సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న సమయంలో ఒక అతను తమన్నాని కలిసి పేరు మార్చుకోమని సూచించాడట. ఇంగ్లిష్‌లో అదనంగా a,h జోడీంచుకోవాలని సలహా ఇవ్వడంతో ఆమె పేరు Tamannaah అయిందట.

పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకురావడం జరిగిందని, కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చిందని తమన్నా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే తమన్నా తాజాగా చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకి నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు రావాలంటూ నోటీసులలో తెలియజేశారు. అయితే తమన్నా చేసిన పని వలన కోట్ల నష్టం వచ్చిందని ప్రసార హక్కులు కలిగిన వయాకామ్ తమ ఫిర్యాదులో తెలియజేసింది. గతేడాది ఐపీఎల్ ఎడిషన్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందని వయాకామ్ ఆరోపించింది. దీంతో ఇందుకు సంబంధించి తమన్నాను సైబర్ సెల్ ప్రశ్నించనుంది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఇదే కేసులో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సైబర్ సెల్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సంజయ్ దత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున విచారణకు హాజరుకాలేదు. తన స్టేట్ మెంట్ నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్ ను కోరడంతో వారు అనుమతి ఇచ్చినట్టు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram