Chiranjeevi| చిరంజీవిపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్.. వారంతా ముసుగు దొంగలు..!
Chiranjeevi| లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలలోను , రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకుంది. 90లలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి
Chiranjeevi| లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలలోను , రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకుంది. 90లలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించంది. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది. ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, మరోవైపు లేడి ఓరియెంటెడ్ పాత్రలతో మెప్పస్తూ అదరగొట్టింది.తను మెయిన్ లీడ్‌గా చేసిన కొన్ని సినిమాలు స్టార్ హీరోల చిత్రాలకి ధీటుగా విడుదల కావడమే కాదు, కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. ఇక రాజకీయాలలో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేసుకుంది.

తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన విజయశాంతి ఆ పార్టీని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల్లో కూడి పని చేసింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌లో పెద్ద యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే విజయశాంతి గతంలో హీరోల గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. విజయశాంతి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడంపై స్పందిస్తూ పలు విమర్శలు చేసింది. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, ప్రజల తరఫున పోరాడలేనప్పుడు కచ్చితంగా వేలెత్తి చూపిస్తాం. ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను స్పందిస్తానని, వేలెత్తి చూపిస్తానంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సినిమాలు, రాజకీయాలు వేరని చెప్పిన విజయశాంతి..తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని సినీ తారలను కోరితే ఒక్కరు కూడా స్పందించలేదు. తెలంగాణ ప్రజలు ఇచ్చే డబ్బులతోనే ఇంతటి పారితోషికాలు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం గురించి స్పందించాలని అడిగన కూడా ఎవరూ ముందుకు రాలేదని వాపోయింది.వాళ్లు స్వార్థంతోనే స్పందించలేదని పేర్కొంది. హీరోలకు గట్స్ లేవని అనుకుంటున్నానని, సినిమాల్లోనే హీరోలు కాదు, బయటకు కూడా హీరోలుగానే ఉండాలని, సినిమాల్లో సమాజానికి సేవ చేశానని చెప్పడం, కాదు బయటకు కూడా చేయాలని అన్నది విజయశాంతి. కనీసం 20శాతం అయినా కూడా చేయడం లేదని, అంతా ముసుగు దొంగలు` అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలంటే కుదురుతుందా. ఎన్టీఆర్‌లా అందరు అయిపోవాలంటే సాధ్యమవుతుందా? అంటూ చిరంజీవిని ఉద్దేశించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది విజయశాంతి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram