మెగా పవర్ స్టార్ ఇక మీదట డాక్టర్ రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ హీరో రామచరణ్‌ను ఇక డాక్టర్ రామ్‌చరణ్‌గా పిలుచుకోబోతున్నాం. హీరో రామ్‌చరణ్‌కు తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది
గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన వేల్స్ యూనివర్సిటీ
విధాత, హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ హీరో రామచరణ్‌ను ఇక డాక్టర్ రామ్‌చరణ్‌గా పిలుచుకోబోతున్నాం. హీరో రామ్‌చరణ్‌కు తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా హీరో రామ్‌చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. రామ్‌చరణ్ డాక్టరేట్ అందుకోవడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు నటుడికి అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్‌కు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడంపై పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతడు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహమన్నారు. డాక్టరేట్ స్ఫూర్తితో రామ్‌చరణ్ చలన చిత్ర పరిశ్రమలో మరిన్ని విజయాలు..పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram