ICMR Warns | ఇటీవల కాలంలో క్యాన్డ్ ఫుడ్ వినియోగంపై ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక హెచ్చరికలు చేసింది. ప్యాక్ చేసిన వస్తువులపై లేబుల్స్ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో వినియోగదారులు సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ICMR Warns | ఇటీవల కాలంలో క్యాన్డ్ ఫుడ్ వినియోగంపై ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక హెచ్చరికలు చేసింది. ప్యాక్ చేసిన వస్తువులపై లేబుల్స్ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో వినియోగదారులు సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. షుగర్ ప్రీ అని చెప్పుకునే అనేక ఆహారాల్లో వాస్తవానికి ఎక్కువగా కొవ్వులు ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. అలాగే క్యాన్డ్ పండ్ల రసాల్లోనూ పదిశాతం పండ్ల గుజ్జు మాత్రమే వినియోగించవచ్చని చెప్పింది.
కంపెనీలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు తమ ఉత్పత్తులు ఆరోగ్యకరమైందని ఒప్పించేలా తయారు చేస్తున్నాయని.. అయితే, అవి వాస్తవానికి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో నిర్ధారించేందుకు వినియోగదారులు విచక్షణతో ఉపయోగించాలని చెప్పింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన ప్రమాణాలు అమలులో ఉన్నా.. లేబుల్స్‌పై అందించిన సమాచారం తప్పుదారి పట్టించేలా ఉండవచ్చని.. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)తో కలిసి జారీ చేసిన మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్ పేర్కొంది. ‘నేచురల్’ ఫుడ్ ప్రొడక్ట్ అంటే ఎలాంటి రంగులు, ఫ్లేవర్స్ కలపకుండా, తక్కువ ప్రాసెసింగ్ చేసిన ఆహారమని.. కానీ కంపెనీలు రెండు, మూడు సహజసిద్ధమైన పదార్థాలను వాడి తమవి నేచురల్ ఫుడ్ అంటూ లేబుల్ వేసుకుంటున్నారని పేర్కొంది. వినియోగదారులు ఆయా ఉత్పత్తులపై ఉన్న లేబుల్‌లో ‘నేచురల్’ అని ముద్రించి ఉన్నా నమ్మొద్దని.. పూర్తిగా అందులోని వివరాలను ఒకటికి రెండుసార్లు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని చెప్పింది.
ఇదిలా ఉండగా.. ఐసీఎంఆర్ ఇటీవల ప్రొటీన్స్ పౌడర్ వాడకం విషయంలో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రోటీన్ సప్లిమెంట్లతో కలిగే దుష్ప్రభావాలపై సైతం హెచ్చరించింది. తమ శరీర ఆకృతిని మార్చుకోవాలనే తపనత యువత హాని కలిగించేవి వినియోగిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఆయా ఉత్పత్తులతో ఫిట్‌నెస్ మెరుగుపడకపోగా మధుమేహం, గుండెజబ్బులు, ఊబకాయం జబ్బుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. కృత్రిమ రుచి కోసం మార్కెట్‌లో వినియోగించే ప్రోటీన్ పౌడర్లకు అదనంగా చెక్కెర, రసాయన రుచులను కలుపుతున్నారు. ఫలితంగా అదనంగా షుగర్ లెవల్స్ శరీరంలోకి వెళ్తున్నది. ఆ చెక్కెర అంతా బరువు పెరగడానికి, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది.